Vice-Presidential election: ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభం

ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.

Vice-Presidential election: ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభం

Vice-Presidential election: ఢిల్లీలోని పార్లమెంట్‌ హాల్‌లో శనివారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. అధికార ఎన్డీయే తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీ చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది.

Jabalpur Fire: ఆ డాక్టర్లను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి.. ఎందుకంటే

సాయంత్రం ఆరు గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఈ రోజు రాత్రే ఫలితం వెలువడుతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్ విజయం దాదాపు లాంఛనమే. ఈ ఓటింగ్‌లో పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 788 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన అభ్యర్థిని ప్రధాని నేరుగా కలుస్తారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.

TikTok: ‘టిక్‌టాక్’ మళ్లీ వస్తోందా.. అసలు నిజమేంటి?

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఎంపీ హేమా మాలిని, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిరణ్ రిజిజు, అర్జున్ మేఘావాల్, వి.మురళీధరన్, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నద్దా, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్, డీఎమ్‌కే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్, కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.