will make your day : కట్టెలలో చేసిన ఆటవస్తువుపై చిన్నారుల ఆట చూడండీ..

  • Published By: nagamani ,Published On : June 16, 2020 / 07:22 AM IST
will make your day : కట్టెలలో చేసిన ఆటవస్తువుపై చిన్నారుల ఆట చూడండీ..

అవసరం అన్నీ నేర్పిస్తుంది అనేది పెద్దలు చెప్పిన మాట.అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ..ఏమీ లేనిచోట ఉండాల్సి వస్తే అన్నీ తామే చేసుకోవాలి. అదిగో అటువంటి సృజనాత్మకతతో చేసినదానితో ఇద్దరు చిన్నారులు  చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. తగినంత వనరులులేని స్థితిలో ఇద్దరు చిన్నారులు ఆడుకోవాలనుకున్నారు. అలా ఏమీ లేని ప్రాంతంలో ‘‘see-saw’’ ను తయారు చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. 

సాధారణంగా చిన్నపిల్లల్ని పార్క్ కు తీసుకెళితే..వాళ్లు పరుగు పరుగున వెళ్లి ‘‘see-saw’’ ఎక్కి చక్కగా ఆడుకుంటారు. see-saw అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుని (చిన్నారులుకావచ్చు పెద్దవారు కావచ్చు) పొడవైన ప్లాంక్ పై బాలెన్స్ తో కూర్చుని కిందికీ పైకీ లేక గిరగిరా చుట్టూ తిరిగే ఓ సాధనం. కానీ తమకంటూ ఎటువంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇద్దరు చిన్నారులు బలమైన కట్టెలతో see-saw ఏర్పాటు చేసుకున్నారు మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఇద్దరు చిన్నారులు. ఓ కట్టెను భూమిలో పాతారు. వంకరగా..తమకు see-sawకు సెట్ అయ్యేలాంటి కట్టెను దానిపై పెట్టి ఆడుకుంటున్నారు.

అది ఎక్కి చక్కగా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా కింద పడిపోకుండా గిరిగిరా తిరిగేస్తు ఆడుకుంటున్నారు.తమకు ఎటువంటి  సౌకర్యాలు లేకపోయినా..ఉన్నంతలో తమను తాము సంతోషంగా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవచ్చు. ఐఎఎస్ షేర్ సింగ్ మీనా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.