Noida viral video: సినిమా స్టైల్లో 2 కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేసిన విద్యార్థులు.. కేసు నమోదు

కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేశారు కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. వైట్ టొయోటా ఫార్చునర్ ఎస్వీయూ కార్లతో నోయిడాలోని సెక్టార్ 126 ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు సినిమాల స్టైల్లో స్టంట్లు చేశారు.

Noida viral video: సినిమా స్టైల్లో 2 కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేసిన విద్యార్థులు.. కేసు నమోదు

Noida viral video: కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేశారు కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. వైట్ టొయోటా ఫార్చునర్ ఎస్వీయూ కార్లతో నోయిడాలోని సెక్టార్ 126 ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు సినిమాల స్టైల్లో స్టంట్లు చేశారు.

ఆ విద్యార్థులు అమిటీ వర్సిటీకి చెందిన వారుగా తెలుస్తోంది. 360-డిగ్రీ డ్రిఫ్ట్ స్టంట్‌లు చేస్తూ వారు అత్యుత్సాహం ప్రదర్శించగా కొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసుల వరకూ వెళ్లాయి. సాధారణంగా ఆ విద్యార్థులు చేసిన స్టంట్ల వంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. నిజజీవితంలో ఇటువంటివి చేయాలంటే ప్రత్యేకమైన ఖాళీ స్థలాల్లో నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది.

అయితే, జనాలు తిరిగే రోడ్లపై కారుతో స్టంట్లు చేశారు ఆ యువకులు. తమ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగేలా వ్యవహరించారు. పార్కింగ్ స్థలం వద్ద కూడా ఇలాగే చేస్తూ కారును ఆపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Covid Booster Shot : మీరు కొవిడ్ బూస్టర్ షాట్ ఇంకా తీసుకోలేదా? బూస్టర్ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!