Booze Party : కోవిడ్ సెంటర్‌లో దారుణం.. మందుపార్టీ చేసుకున్న సిబ్బంది

దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై మహా నగరంలోనూ కరోనా కోరలు చాచింది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రభుత్వంతో పాటు నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. కరోనా గురించి ప్రజలు, ప్రభుత్వం ఇంతలా ఆందోళన చెందుతుంటే.. ఇదే ముంబై నగరంలోని ఓ కోవిడ్ సెంటర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Booze Party : కోవిడ్ సెంటర్‌లో దారుణం.. మందుపార్టీ చేసుకున్న సిబ్బంది

Booze Party

Booze Party : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. అక్కడ నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో మహారాష్ట్ర నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై మహా నగరంలోనూ కరోనా కోరలు చాచింది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రభుత్వంతో పాటు నగరవాసుల్లో భయాందోళన నెలకొంది.

కరోనా గురించి ప్రజలు, ప్రభుత్వం ఇంతలా ఆందోళన చెందుతుంటే.. ఇదే ముంబై నగరంలోని ఓ కోవిడ్ సెంటర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై శివారు ప్రాంతమైన కళ్యాణ్-డోంబివలిలో ఉన్న ఓ కోవిడ్ సెంటర్‌లో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మందుకొట్టి అంతా ఎంజాయ్ చేశారు. కోవిడ్ సెంటర్ నిర్వాహకులే ఈ మందు పార్టీ అరేంజ్ చేయడం గమనార్హం. కొందరు సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు.

డోంబివలి కార్పొరేషన్‌లోని ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో ఈ మందు పార్టీ జరిగింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఈ మందు పార్టీ వీడియోను రికార్డ్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలే కరోనా భయపెడుతుంటే, ఈ టైమ్ లో వీరికి ఇదేం పోయే కాలం అని అంతా మండిపడుతున్నారు. వీడియో వైరల్ కావడం, తీవ్ర విమర్శలు రావడంతో.. మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే కోవిడ్ సెంటర్ నిర్వాహకుడిని సస్పెండ్ చేసింది. అలాగే

ఈ పార్టీలో భాగమైన సిబ్బందిలో ఒకరిని విధుల్లోంచి తొలగించామని, మిగిలిన వారు బయట వ్యక్తులని అధికారులు తెలిపారు. సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయాక ఈ మందు పార్టీ జరిగినట్లు తెలిసింది. ఇకపోతే కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కేసుల సంఖ్య 75వేలకు చేరింది. కరోనా ఇంతలా ఉంటే.. జాగ్రత్తగా ఉండాల్సింది పోయి కోవిడ్ సెంటర్‌లో మందు పార్టీ చేసుకున్న ప్రబుద్ధులపై అంతా మండిపడుతున్నారు.

కోవిడ్ కేర్ సెంటర్ అంటే.. కరోనా రోగులు ఉంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రోగులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. కరోనాతో గేమ్స్ ఆడితే ప్రాణాలకే డేంజర్. ఇవన్నీ తెలిసి కూడా… మందుపార్టీ చేసుకోవడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఆ తాగుబోతులకు పోయే కాలం వచ్చిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.