Chinkara: జింక మాంసం వండుకుతిన్న వేటగాళ్లు.. బిష్ణోయ్ వర్గం ఆగ్రహం

రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్‌కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ్లలో కొందరి ఫోన్ల నుంచి షేర్ అయ్యాయి.

Chinkara: అడవి జింక (చింకారా) మాంసాన్ని వేటగాళ్లు వండుకుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు, బిష్ణోయ్ వర్గం వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్‌కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ్లలో కొందరి ఫోన్ల నుంచి షేర్ అయ్యాయి. తర్వాత అవి వైరల్ అయ్యాయి. దీంతో జంతు సంరక్షణ సమితి సభ్యులు, జింకల్ని దైవంగా భావించే బిష్ణోయ్ వర్గం వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని గుర్తించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లో పలు చోట్ల నిరసనకు దిగారు. బిష్ణోయ్ వర్గం వాళ్లు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

ఈ అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చింకారాల్ని సంరక్షించాలని కోరారు. రెండు రోజుల్లోగా నిందితులపై చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. వేటగాళ్లు జోధ్‌పూర్-బర్మర్ ప్రాంతంలో వీటిని వేటాడుతుంటారని, ఈ మాంసాన్ని కొన్ని హోటళ్లకు విక్రయిస్తారని స్థానిక జంతు సంరక్షణ సమితి సభ్యుడొకరు తెలిపారు. కాగా, వీడియోలో కనిపించింది చింకారా కాకపోయి ఉండొచ్చని, మేక అయ్యుండొచ్చని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు అక్కడి రక్తపు మరకల నమూనాలు సేకరించారు. వాటి ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవి జంతువైన చింకారాను వధించడం చట్టరీత్యా నేరం.

 

ట్రెండింగ్ వార్తలు