Stray Dogs: రోగుల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం.. ఆసుపత్రిలో రోగుల బెడ్లపై పడుకున్న 2 కుక్కలు
మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోకి కుక్కలు తిరగడం కలకలం రేపింది. రెండు కుక్కలు రోగుల బెడ్లపై హాయిగా పడుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో వీటి ద్వారా స్పష్టమవుతోంది. రోగుల ప్రాణాలతో ఆ ఆసుపత్రి సిబ్బంది చెలగాటమాడుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Stray Dogs: మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోకి కుక్కలు తిరగడం కలకలం రేపింది. రెండు కుక్కలు రోగుల బెడ్లపై హాయిగా పడుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో వీటి ద్వారా స్పష్టమవుతోంది. రోగుల ప్రాణాలతో ఆ ఆసుపత్రి సిబ్బంది చెలగాటమాడుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గర్భిణీగా ఉన్న తన భార్యను వైద్యం కోసం తీసుకువచ్చిన సిద్ధార్థ్ జైన్ అనే వ్యక్తి ఆసుపత్రి బెడ్లపై కుక్కలు పడుకుని ఉండడాన్ని గమనించి, వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం గురించి తెలుసుకున్న అధికారులు ఆసుపత్రిలోకి కుక్కలు రావడంపై విచారణకు ఆదేశించారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
దీనిపై జబల్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ మిశ్రా స్పందిస్తూ.. ‘బీఎంవో డాక్టర్ సీకే అట్రాలియాకు నోటీసులు జారీ చేశాం. ఆసుపత్రిలోకి కుక్కలు ప్రవేశించిన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. గతంలోనూ మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
Street Dogs Seen Sleeping On Patients’s Beds In Shahpura Community #health Center in Jabalpur. #VIDEO goes #Viral #MadhyaPradesh #hospital #UnMuteIndia
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/822B3Tn6Io
— UnMuteINDIA (@LetsUnMuteIndia) December 5, 2022