ఆక్సిజన్ కొరతతో 6గురు మృతి..ఐసీయూకి తాళం వేసి దాక్కున్న డాక్టర్లు,సిబ్బంది

ఆక్సిజన్ కొరతతో 6గురు మృతి..ఐసీయూకి తాళం వేసి దాక్కున్న డాక్టర్లు,సిబ్బంది

Videos Show Locked Icu Dead Bodies Within Staff In Hiding

Kriti Hospital గుర్గావ్‌లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజ‌న్ కొర‌త కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తార‌న్న భ‌యంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల్-30న ఈ సంఘటన జరగగా..దీనికి సంబంధించిన వీడియోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోలలో..కోవిడ్ బాధితుల కుటుంబసభ్యులు హాస్పిటల్ డాక్టర్లు,సిబ్బంది కలిసేందుకు హాస్పిటల్ లోనికి ప్రవేశించారు. ఐసీయూల డోర్టు లాక్ చేయబడినట్లు వారు గుర్తించారు. ఆ తర్వాత ఆ తలుపులు పగులకొట్టుకొని లోనికి ప్రవేశించిన వారికి ఐసీయూలోని బెడ్స్ పై విగతజీవులుగా పడిఉన్న కొందరు పేషెంట్లు కనిపించారు. కోవిడ్ బాధితుల కుటుంబసభ్యులు వార్డులలో పరుగులు తీస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది. అయితే అక్కడ ఒక్క డాక్టర్ కానీ,సిబ్బంది కానీ ఎవ్వరూ లేరు. రిసప్షన్ లో కూడా ఎవ్వరూ లేనట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

వైద్యులు, సిబ్బంది క‌నిపించ‌క‌పోవ‌డం, త‌మ వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో పలువురు రోగుల బంధులు హాహాకారాలు చేశారు. హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత రావడంతో డాక్టర్లు,సిబ్బంది ఐసీయూ పేషెంట్లను వదిలేసి వెళ్లిపోయారని బాధిత కుటంబసభ్యులు ఆరోపించారు. ఆక్సిజన్ విషయంలో హాస్పిటల్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధిత కుటుంబసభ్యుడు మాట్లాడుతూ..తాను తన సొంతంగా తన మేనల్లుడి కోసం మూడు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చానని,కానీ హాస్పిటల్ సిబ్బంది దాన్ని కేవలం నిమిషాల్లో ఫినిష్ చేశారని,దీంతో తన మేనల్లుడు చనిపోయాడని తెలిపారు. ఆక్సిజన్ పరిస్థితిపై హాస్పిటల్ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదని,ఆక్సిజన్ కొరత కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని మరొకరు తెలిపారు.

కాగా, ఏప్రిల్ 30న మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో ఆక్సిజన్ కొరత ఉందని తాము ప్రతి ఒక్క ప్రభుత్వాధికారికి చెప్పామని,అయితే వారి వద్ద నుంచి తమకు ఆక్సిజన్ లభించలేదని,ఆక్సిజన్ కొరత కారణంగా తమ వారిని వేరే హాస్పిటల్ కు తరలించుకోవాలని వారి బంధువులకు సమాచారమందిచామని,అయితే ఎవ్వరూ రాలేదని,రాత్రి 11గంటల సమయంలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ స్వాతి రాథోర్ తెలిపారు. రోగుల బంధువులు త‌మ‌పై దాడి చేస్తార‌న్న భ‌యంతో అక్క‌డి నుంచి పారిపోయి క్యాంటీన్ లో దాక్కున్నారని,విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారని, దీంతో వైద్యులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నట్లు రాథోర్ తెలిపారు. ఏప్రిల్ 24న మ‌ర‌ణించిన ఒక రోగి బంధువులు వైద్య సిబ్బందిని కొట్టార‌ని, ఆ భ‌యంతోనే వైద్యులు, సిబ్బంది త‌మ ర‌క్ష‌ణ కోసం దాక్కున్నార‌ని ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ తెలిపారు.