Corrupt Officer : బీహార్‌ అవినీతి అధికారి ఇంట్లో డ‌బ్బే..డ‌బ్బు-లెక్కపెట్టడానికి గంటల సమయం

అక్రమాస్తుల కేసులో బీహార్‌కు చెందిన డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు 3 కోట్ల రూపాయల న‌గదును స్వాధీనం చేసుకున్నారు.

Corrupt Officer : బీహార్‌ అవినీతి అధికారి ఇంట్లో డ‌బ్బే..డ‌బ్బు-లెక్కపెట్టడానికి గంటల సమయం

Corrupt Officer

Vigilance officers : ఆ డబ్బును లెక్కించేందుకు అధికారులు చెమటలు క‌క్కారు. క‌రెన్సీ కట్టలన్నింటీనీ బెడ్డుపై పోసి.. గంటల కొద్దీ లెక్కపెట్టారు. అవినీతి అధికారుల ధ‌న దాహనికి అంతే ఉండ‌దనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిద‌ర్శనం. వాళ్లకి ప్రభుత్వమిచ్చే జీతం కంటే.. అక్రమంగా సంపాదించే లంచం పైనే మ‌క్కువ ఎక్కువ. మ‌న దేశంలో అక్రమార్జన‌కు బోలెడు అవకాశాలు. కావాల్సినంత దోచుకోవ‌చ్చు.. దాచుకోవ‌చ్చు.. కానీ, ఎన్నాడో ఓ రోజు ప‌ట్టుప‌డాల్సిందే.. సంపాదించింది క‌క్కాల్సిందే.. ఇలాంటి ఘ‌ట‌నే పాట్నాలోని చోటు చేసుకుంది.

ఓ డ్రగ్ అధికారిపై దాడి చేసిన అధికారుల‌కు దిమ్మతిరిగి పోయే రేంజ్‌లో న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. అక్రమాస్తుల కేసులో బీహార్‌కు చెందిన డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు 3 కోట్ల రూపాయల న‌గదును స్వాధీనం చేసుకున్నారు.

IAS Officer Puja Singhal:ఝార్ఖండ్ లో భారీ అవినీతి తిమింగలం: ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ఇళ్లపై ఈడీ దాడులు

అంతేకాదు ఐదు లగ్జరీ వాహనాలు, బినామీ ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 2011లో విధుల్లో చేరిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేంద్రకుమార్‌పై దాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జెహానాబాద్‌లోని అతని ఇల్లు, గయా పట్టణంలోని ఫ్లాట్‌లు, దానాపూర్‌లోని అతని ఫార్మసీ కాలేజ్‌, పట్నా సిటీలో కొత్తగా నిర్మించిన ఇంటిపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.