Bihar : బీహార్ లో నితీశ్ కుమార్ బలపరీక్షకు ముందే..స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా

బీజేపీకి కటీఫ్ చెప్పి..ఆర్జేడీ మద్దతుతో మరోసారి నితీశ్ కుమార్ సీఎంగా జేడీయూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ బలపరీక్ష నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఈక్రమంలో బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నితీశ్ కుమార్ బలపరీక్ష నిరూపించుకోకముందు పలు నాటకీయ పరిణామాల మధ్య అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు.

vijay kumar sinha resigns as the speaker of the bihar assembly : బీజేపీకి కటీఫ్ చెప్పి..ఆర్జేడీ మద్దతుతో మరోసారి నితీశ్ కుమార్ సీఎంగా జేడీయూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఇక బలపరీక్ష నిరూపించుకోవటమే తరువాయిగా ఉంది. నితీశ్ కుమార్ బలపరీక్ష నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఈక్రమంలో బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నితీశ్ కుమార్ బలపరీక్ష నిరూపించుకోకముందు పలు నాటకీయ పరిణామాల మధ్య అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గత 20 నెలల నుంచి స్పీకర్ పదవిలో కొనసాగుతున్న బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయటం అత్యంత ఆసక్తికరంగా మారింది.

Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా..ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు!

బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం నేడు బలాన్ని నిరూపించుకోనున్న క్రమంలో ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరిగాయి. ఇలా బీజేపీ తన మార్కును చూపిస్తోంది బీహార్ లో. ఈక్రమంలో బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. కాగా..స్పీకర్ గా ఉన్న సిన్హాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా.. పదవి నుంచి తప్పుకోవడానికి సిన్హా ససేమీరా అంగీకరించలేదు. కానీ బుధవారం (ఆగస్టు 24,2022) స్పీకర్ పదవికి రాజీనామా చేయటం గమనించాల్సిన విషయం. మరి స్పీకర్ రాజీనామాతో నితీశ్ కుమార్ బలనిరూపణ ఈజీ అయ్యేలా ఉంది.

బీజేపీకి కటీఫ్ చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు (ఆగస్టు 24న) అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ఆర్జేడీ మద్దతుతో జేడీయూ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి 165 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేస్తారని నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ బలపరీక్షకు ముందు బిహార్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నితీశ్ ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుండగా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల నివాసాలపై సీబీఐ బుధవారం దాడులు చేసింది. ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్ జిల్లాలోని 16 చోట్ల సీబీఐ దాడులు చేసింది.

10 interesting points about nitish kumar: నితీష్ కుమార్ గురించి 10 ఆసక్తికర అంశాలు

కాగా..సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా చేయడంతో.. నితీశ్ ప్రభుత్వం బలనిరూపణ సజావుగా జరిగే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 122 సీట్లు వస్తే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంటుంది. కానీ మహాఘట్‌బంధన్ ప్రభుత్వానికి 165 మంది సభ్యుల బలం ఉంది.

ట్రెండింగ్ వార్తలు