Vijay Mallya: విజయ్ మాల్యా రోడ్డు మీదకు.. ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ

ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో..

Vijay Mallya: విజయ్ మాల్యా రోడ్డు మీదకు.. ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ

Vijay Mallya

Vijay Mallya: ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో మంగళవారం ఈ తీర్పునిచ్చింది అక్కడి కోర్టు. లావిష్ గ్రేడ్-1 హోం 18-19 కార్న్ వాల్ టెర్రస్ లో ఉండే మాల్యా.. రెండు ఇళ్లను ఒకే ఇంటికి మార్చి ఫ్యామిలీతో నివాసం ఉంటున్నారు.

34ఏళ్ల తన కొడుకు, 95సంవత్సరాల తల్లి లలితాతో కలిసి కొన్నేళ్లుగా ఉంటున్నారు. నోటీసులు అందాక కుటుంబం స్వతహాగా ఖాళీ చేయకుండా ఇంటి నుంచి పంపేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. మంగళవారం విచారణ తర్వాత బ్యాంక్ ప్రొసీడింగ్స్ లో ఎటువంటి ఆలస్యం జరపాల్సిన అవసర్లేదని చెప్పారు. కాగా, ఆ ఇంటి విలువ మిలియన్ పౌండ్స్ లో ఉంటుందని చెప్తున్నారు.

లండన్ హైకోర్టు డిప్యూటీ మాస్టర్ మంగళవారం రోస్ క్యాపిట్ పెట్టిన అప్లికేషన్ ను కొట్టేశారు. జడ్జిమెంట్ ను వాయిదా వేయాలని అడిగిన పిటిషన్ ను కూడా తిప్పిపంపారు. సరిపడా సమయం ఇచ్చామని మరో జడ్జి ఈ విషయంలో వేరే నిర్ణయం ఇస్తారని అనుకోవడం లేదని డానియెల్ మార్గోలిన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: పది కూడా పాస్ అవని పప్పూ.. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్

రోస్ క్యాపిటల్, విజయ్ మాల్యా తీర్పును వాయిదా వేయాలని వేరే జడ్జి కోసం ఎదురుచూశారు. తీర్పు తర్వాత తన 95సంవత్సరాల తల్లిని తీసుకుని బయటకు వెళ్లాల్సి ఉంది.