Malya Offer : సెటిల్ మెంట్ ప్యాకేజీ

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 11:24 AM IST
Malya Offer : సెటిల్ మెంట్ ప్యాకేజీ

Vijay Malya మరో ఆఫర్ తో ముందుకొచ్చాడు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో దాచుకుంటున్న సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకొనే మార్గాలన్నీ మూసుకపోయాయి. దీంతో భారత్ ఎదుట పలు ప్రతిపాదనలు ఉంచుతున్నాడు. తాజాగా సెటిల్ మెంట్ తో కూడిన ఆఫర్ ఇచ్చాడు. దీనిని అంగీకరించాలంటూ కోరుతున్నారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు మాల్యా ప్రస్తుతం సిద్ధం కావడం విశేషం.

అసలు ఏం ప్రతిపాదించాడు ?

బ్యాంకులో ఉన్న పలు సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు మాల్యా. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే..ఇక్కడ పరిష్కారం మొత్తం…ఎంత ప్రతిపాదించారనే విషయంపై స్పష్టత రాలేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన Interest తో కలిపి 13 వేల 960 కోట్లు రూపాయలను చెల్లిస్తామని గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

భారతీయ బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మార్చి-2,2016న లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను ED, CBI కేసులు ఎదుర్కొంటున్నారు. మాల్యాను భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కొన్ని చట్టపరమైన సమస్యలుండడంతో అప్పగింతలు ఆలస్యమవుతున్నాయి.

2020, జూన్ 3వ తేదీన రాత్రికి ముంబైకి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం Malya ఇచ్చిన ఆఫర్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.