Kingfisher House : రూ.52 కోట్లకు హైదరాబాద్ టాప్ రియల్టర్ చేతికి మాల్యా ప్రాపర్టీ

వేల కోట్లు బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా సొంత ప్రాపర్టీ కింగ్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. ఎట్టకేలకు లెండర్స్ మాల్యా కింగ్స్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు డెవలపర్ రూ.52 కోట్లకు మాల్యా కింగ్ షిషర్ హౌస్ ను సొంతం చేసుకున్నారు. Saturn Realtors అనే హైదరాబాద్ రియల్టర్స్ మాల్యా ప్రాపర్టీని దక్కించుకున్నారు.

Kingfisher House : రూ.52 కోట్లకు హైదరాబాద్ టాప్ రియల్టర్ చేతికి మాల్యా ప్రాపర్టీ

Vijay Mallya’s Kingfisher House Sold For Rs 52 Crore

Vijay Mallya’s Kingfisher House : వేల కోట్లు బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా సొంత ప్రాపర్టీ కింగ్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. ఎట్టకేలకు లెండర్స్ మాల్యా కింగ్స్ ఫిషర్స్ హౌస్ అమ్మేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు డెవలపర్ రూ.52 కోట్లకు మాల్యా కింగ్ షిషర్ హౌస్ ను సొంతం చేసుకున్నారు. Saturn Realtors అనే హైదరాబాద్ రియల్టర్స్ మాల్యా ప్రాపర్టీని దక్కించుకున్నారు.

గతంలో ఈ Kingfisher House ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు పలుమార్లు ప్రయత్నించి లెండర్స్ విఫలమయ్యారు. చివరికి మాల్యా ప్రాపర్టీని వేలం పాట ద్వారా విక్రయించారు. మాల్యాకు ఇచ్చిన రుణాల రికవరీలో భాగంగా ఆస్తులన్నింటినీ వేలం పాటల ద్వారా విక్రయించారు. హైదరాబాద్‌కు చెందిన టాప్ రియల్టర్ కంపెనీ మాల్యా (Kingfisher House) స్థిరాస్తిని రూ.52 కోట్లకే కొనుగోలు చేసింది. బ్యాంకులు నిర్దేశించిన రిజర్వ్ ధర కన్నా సగం రేటుకే అమ్ముడైంది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరు మీద ఉన్న ఈ భవనాన్ని బ్యాంకర్లు వేలంపాట ద్వారా విక్రయించారు. మొదట ఈ భవనం రిజర్వ్ ప్రైస్‌ను 135 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కానీ, కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు. 2019 నుంచి ఇప్పటిదాకా 8 సార్లు ఈ ప్రాపర్టీని విక్రయించడానికి వేలంపాటలను నిర్వహించగా అమ్ముడు పోలేదు. చివరికి ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్‌ను తగ్గించారు బ్యాంకర్లు. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన శాటర్న్ రియల్టర్స్ (Saturn Realtors) కంపెనీ మాల్యా సొంత భవనాన్ని కొనుగోలు చేసింది.

2012లో నిలిచిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రుణాల చెల్లింపులో ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాను డిఫాల్టర్‌గా భారతీయ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జూలై 26న, బ్రిటిష్ కోర్టు మాల్యాకు వ్యతిరేకంగా దివాలా ఉత్తర్వును మంజూరు చేసింది.  భారతీయ స్టేట్ బ్యాంకు (SBI) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో తీర్పు వెలువడింది. ఇండియాలోని మాల్యా ఆస్తులను జప్తు చేసుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది.

మాల్యాను భారత్‌ కు అప్పగింత కేసును విచారించిన యూకే కోర్టు ఆయన దివాళా తీసినట్లు సంచలన ప్రకటన చేసింది. మాల్యా స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. ఇండియాలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యూకే కోర్టు సమర్థించింది.