Next Gujarat CM : విజయ్ రూపానీ రాజీనామా.. కొత్త సీఎం రేసులో ఎవరంటే?

గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు.

Next Gujarat CM : విజయ్ రూపానీ రాజీనామా.. కొత్త సీఎం రేసులో ఎవరంటే?

Vijay Rupani Resigns Who Will Be Next Gujarat Cm

Who Will be Next Gujarat CM: గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. శనివారం (సెప్టెంబర్ 11) ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త సీఎం ఎవరు అనేది చర్చ జరుగుతోంది. రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఒకవైపు.. అనారోగ్య కారణాలతోనే విజయ్‌ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, మరోవైపు ఆయన రాజీనామాకు అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీనామా అనంతరం రూపానీ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధి కొనసాగుతుందని రూపానీ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ సమాన అవకాశాన్ని కల్పించే బీజేపీ సంప్రదాయం ప్రకారం తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. పార్టీ తనకు అప్పగించే ఏ హోదాలోనైనా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రూపానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసేందుకు తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తన పరిపాలనలో ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Read More : Gujarat : సీఎం విజయ్ రూపానీ రాజీనామా

గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే గుజరాత్‌లో బలమైన పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు సమాచారం. గత ఎన్నికల సమయంలో పటేల్‌ సామాజిక వర్గం నుంచి హార్ధిక్‌ పటేల్‌ తమ హక్కుల కోసం బీజేపీని బెంబేలిత్తించారు. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దాంతో అధికార బీజేపీ వైపు నుంచి స్పందన కరువైంది.

తదుపరి సీఎం ఎవరంటే?
గుజరాత్‌లో అధికార బీజేపీకి పటేళ్ల నుంచి భారీ మద్దతు ఉంది. రాష్ట్ర జనాభాలో పటేల్ సామాజికవర్గం 15 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం కీలక స్థాయిలో ఉన్నారు. అందుకే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు బీజేపీ యోచిస్తోంది. వారికి దగ్గరయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రూపానీతో రాజీనామా చేయించినట్టు సమాచారం. మరి.. ఇంతకీ ఆ సీఎం పీఠాన్ని బీజేపీ ఎవరికి కట్టబెడతుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, సీఆర్‌ పటేల్, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆర్‌సి ఫాల్దూ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

గుజరాత్ బీజేపీ ఇన్‌ఛార్జి మాట్లాడుతూ.. రాష్ట్రానికి కొత్త సీఎం పార్టీ ప్రక్రియ ప్రకారమే నిర్ణయించడం జరుగుతుందన్నారు. నివేదికల ప్రకారం.. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు గుజరాత్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విజయ్ రూపానీ రాజీనామాపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీకి సొంత సీఎం పట్ల విశ్వాసం లేకపోవడమే కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.
High Court : ప్రజల్ని ఏరా,పోరా,ఏమే..అని అనటానికి వీల్లేదు : పోలీసులకు హైకోర్టు ఆదేశాలు