Vijay Sethupathi : ఎయిర్ పోర్టులో దాడి.. అసలేం జరిగిందో చెప్పిన విజయ్ సేతుపతి

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు లాంజ్ లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ సేతుపతిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాడి

Vijay Sethupathi : ఎయిర్ పోర్టులో దాడి.. అసలేం జరిగిందో చెప్పిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi

Vijay Sethupathi : ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు లాంజ్ లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ సేతుపతిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించాడు. అదో చిన్న వివాదం అని చెప్పాడు. తనపై దాడికి దిగిన వ్యక్తి తమతో పాటే విమానంలో ప్రయాణించాడని వెల్లడించాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని.. అతడికి, తన సిబ్బందికి మధ్య విమానంలోనే గొడవ మొదలైందని, విమానం దిగిన తర్వాత కూడా వివాదం కొనసాగిందని వివరించాడు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఓ దశలో అతడు మానసిక సమతుల్యత కోల్పోయాడని, ఆ పరిస్థితిలోనే దాడి చేశాడని, అయితే ఈ వివాదాన్ని పోలీస్ స్టేషన్ లో పరిష్కరించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించాడు. ఆ వ్యక్తి తన అభిమాని కాదని తెలిపాడు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

కాగా, తనకు భద్రతా సిబ్బందిని నియమించుకోవడం ఇష్టముండదని, ప్రతి ఒక్కరితోనూ ప్రేమతో వ్యవహరించడమే తనకు తెలుసని స్పష్టం చేశాడు. ప్రేమను పంచితే ఎదుటి వాళ్ల నుంచి కూడా ప్రేమ లభిస్తుందని భావిస్తానని అన్నాడు. ఎప్పుడు ప్రయాణించినా, తన క్లోజ్ ఫ్రెండ్(30 ఏళ్లుగా) వెంటే ఉంటాడని, అతడే తనకు మేనేజర్ కూడా అని వివరించాడు. అంతకుమించి తాను భద్రతా సిబ్బందిని కోరుకోనని అన్నాడు. ప్రజలతో మమేకం అయ్యేందుకే తాను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, భద్రతా సిబ్బంది ఉంటే అది సాధ్యం కాదని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డాడు.