Mission Prarambh: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్.. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

Mission Prarambh: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్.. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం

Mission Prarambh

Mission Prarambh: భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం 11.30గంటలకు విక్రమ్-ఎస్ ను ఇస్రో ప్రయోగించింది. రాకెట్ ఎటువంటి అడ్డంకులు లేకుండా నింగిలోకి దూసుకెళ్లడంతో ప్రయోగం విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

మిషన్ ప్రారంభం విజయవంతంగా పూర్తయింది. అభినందనలు అని ఇస్రో ట్విట్టర్‌లో ప్రకటించింది.

ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని తిలకించేందుకు శ్రీహరికోటకు వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత స్టార్టప్‌లకు ఈ రాకెట్ ప్రయోగం కీలక మలుపు అని అన్నారు. ప్రయెగం విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన మాట్లాడుతూ.. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా మేము ఈరోజు చరిత్ర సృష్టించాం. ఇది భారతదేశానికి అంతరిక్షయాన రంగంలో గొప్ప పేరును తెలుస్తోందని అన్నారు.

హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్‌ సారాభాయ్‌ పేరుమీద దీనికి విక్రమ్‌-ఎస్‌ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్‌, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్‌ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.