Five Squats Punishment : అత్యాచార నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలు.. బీహార్‌లో పంచాయితీ పెద్దల తీర్పు

బీహార్‌లో గ్రామ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కేవలం ఐదు సార్లు గుంజీలు తీయించి నేరం నుంచి విముక్తి కల్పించారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Five Squats Punishment : అత్యాచార నిందితుడికి శిక్షగా ఐదు గుంజీలు.. బీహార్‌లో పంచాయితీ పెద్దల తీర్పు

Punishment

Five squats punishment : బీహార్‌లో గ్రామ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కేవలం ఐదు సార్లు గుంజీలు తీయించి నేరం నుంచి విముక్తి కల్పించారు. ఈ ఘటన నవాడా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలికపై అత్యాచారం జరిగినట్లు బయటపడటంతో గ్రామ పంచాయితీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు. ఐదు సార్లు గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు ఆదేశించారు. దీంతో నిందితుడు గుంజీలు తీసి నేరం నుంచి తప్పించుకున్నాడు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.