Viral Video: ఆ రోడ్డును చాపలాగ చుట్టేయొచ్చు.. అవినీతిలో కొత్త టెక్నాలజీ చూపించిన మహా కాంట్రాక్టర్

మేక్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సాంప్రదాయిక రహదారి నిర్మాణంలో, మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుక, కుదించబడిన మట్టి మిశ్రమం ఉపయోగిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో, ఇంజనీర్లు రహదారి మన్నికను పెంచడానికి కాంక్రీటును ఉపయోగించడం ప్రారంభించారు.

Viral Video: ఆ రోడ్డును చాపలాగ చుట్టేయొచ్చు.. అవినీతిలో కొత్త టెక్నాలజీ చూపించిన మహా కాంట్రాక్టర్

Carpet Road: అవినీతిపరులకు చాలా నిజాయితీ ఉంటుంది. చాలా నిజాయితీగా వారు అవినీతి చేస్తుంటారు. మన దేశంలో జరిగే అభివృద్ధి పనుల్లో నిజాయితీగల వారి అవినీతి స్పష్టంగా కనిపిస్తుంది. ఈమధ్య కాలంలో రోడ్ నాణ్యత గురించి తరుచూ వీడియోలు కనిపిస్తున్నాయి. కాలితో తన్నితే థారు ఎగిరిపోతుంటుంది. ఒక రోడ్డులో థారుకు బదులు ఇరుసే ఎక్కువ ఉంటుంది. ఒక్కోచోట పూతరేకు వలె ఉంటాయి. ఇలాంటివన్నీ మనకు ప్రత్యక్ష అనుభవంలో ఉన్నవే.

Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

అయితే రోడ్డు అవినీతిలో ఒక కొత్త కోణాన్ని చూపించారు మహారాష్ట్ర కాంట్రాకర్లు. వాళ్లు వేసిన రోడ్డును కార్పెట్‭లాగ మడతపెట్టేయొచ్చు. ఎరిగిపోయే, కొట్టుకుపోయే, చదిరిపోయే రోడ్డు నుంచి మడుచుకుపోయే రోడ్డు వరకు మన కాంట్రాక్టర్లు అవినీతిని అభవృద్ధి చేశారు. ఒక మీరే కిందున్న వీడియోను చూడండి. రోడ్డును ఎలా మడత పెట్టేస్తున్నారో. రోడ్డు కింద ఒక గుడ్డ పెట్టి దానిపై థార్ పరుచుకుంటూ వెళ్లారు.

పైగా ఈ రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కాంట్రాక్టర్ చెప్పడం విశేషం. అయితే, వీడియోలో చూసినట్లుగా, గ్రామస్తులు థార్ కింద ఉన్న పరదాను బయటికి లాగడంతో జర్మన్ టెక్నాలజీ అసలు రంగు బయట పడింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీయే కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తే కావడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి. నాసిరకం పనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Sedition Law: దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే.. లా కమిషన్ షాకింగ్ కామెంట్స్