Haryana: హరియాణాలో అరుదైన ఘటన.. ఓడిపోయిన సర్పంచ్‌కు 11లక్షలు నగదు, కారు అందించిన గ్రామస్తులు.. ఎందుకంటే..?

నాధోడి గ్రామంలో మొత్తం 5,085 ఓట్లు ఉన్నాయి. వీరిలో 4,416 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుందర్ కుమార్ కు 2,200 ఓట్లు రాగా, నరేంద్రకు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో నరేంద్ర విజయంసాధించాడు.

Haryana: హరియాణాలో అరుదైన ఘటన.. ఓడిపోయిన సర్పంచ్‌కు 11లక్షలు నగదు, కారు అందించిన గ్రామస్తులు.. ఎందుకంటే..?

Hariyana

Haryana: ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి ఆ గ్రామస్థులు ఘనంగా సన్మానం చేశారు. అంతేకాదు.. ఎవరూ ఊహించని విధంగా భూమి, కారు, లక్షల నగదు అందించి సత్కరించారు. ఈ అరుదైన ఘటన హరియాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఫతేహాబాద్‌లోని నధోడి గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని బహుమతులతో ముంచెత్తారు. 11లక్షల విలువైన ఐదు వందల నోట్లతో భారీ గజమాల తయారు చేయించి ఆయన మెడలో వేసి ఘనంగా సన్మానించారు.

Viral News: ఓ నివాసంలో బయటపడ్డ 135ఏళ్ల నాటి లేఖ.. సీసాలో ఉంచి భద్రపర్చారు.. అందులో ఏమని రాసిఉందంటే?

హరియాణా రాష్ట్రం ఫతేహాబాద్ జిల్లా నధోడి గ్రామం పేరు ప్రస్తుతం స్థానికంగా మారుమోగుతుంది. 71 ఏళ్ల తర్వాత నధోడి గ్రామానికి తొలిసారిగా షెడ్యూల్డ్ కులాల వ్యక్తి సర్పంచ్‌ అయ్యారు. నాధోడి గ్రామంలో మొత్తం 5,085 ఓట్లు ఉన్నాయి. వీరిలో 4,416 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సుందర్ కుమార్ కు 2,200 ఓట్లు రాగా, నరేంద్రకు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో నరేంద్ర విజయంసాధించాడు. సాధారణంగా అయితే, ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి, అతని మద్దతు దారులు సంబరాల్లో మునిగిపోతారు. కానీ, ఇక్కడి గ్రామస్తులు ఓడిపోయిన వ్యక్తికి నగదు అందించి సన్మానించారు.

Viral Video: వావ్! హెయిర్ కట్ తర్వాత యువకుడిలా మారిపోయిన హోమ్‌లెస్ మ్యాన్‌.. క్రేజీ వీడియో!

సుందర్ కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆ మొత్తాన్ని ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు శనివారం సమావేశమై ప్రజావాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులు సుందర్‌ను బహిరంగంగా సన్మానించి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు 11లక్షల 11వేల నగదు, ఒకటిన్నర ఎకరాల భూమి, స్విఫ్ట్ కారును అందించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తుంది.