Maharashtra : అమరావతి జిల్లాలో బకెట్ నీళ్ల కోసం మహిళల కష్టాలు

మన తెలుగు  రాష్ట్రాల్లో ఈసారి ఎండలు  దంచి కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి.  అమరావతి జిల్లాలో అయితే దాహం తీర్చుకోటానికి బకెట్ నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు.

Maharashtra : అమరావతి జిల్లాలో బకెట్ నీళ్ల కోసం మహిళల కష్టాలు

Amaravati District

Maharashtra : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మన తెలుగు  రాష్ట్రాల్లో ఈసారి ఎండలు  దంచి కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి.  అమరావతి జిల్లాలో అయితే దాహం తీర్చుకోటానికి బకెట్ నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు.

జిల్లాలోని మేల్ఘాట్ పర్వత ప్రాంతంలో పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. బకెట్ నీళ్లకోసం బావి చుట్టూ చేరుతున్నారు పాపం. ఖాదియాల్ గ్రామంలో కేవలం రెండు బావుల్లో మాత్రమే నీరు దొరుకుతోంది. నీరు ఇంకి పోగా టాంకర్ల  ద్వారా వచ్చిన నీటిని ఆ బావుల్లోకి వదులుతున్నారు.

ఆనీటిని తీసుకువెళ్లేందుకు మహిళలు ప్రాణాలకు తెగిస్తున్నారు.  అక్కడి నుంచి బిందెలు బకెట్లతో  తోడి తీసుకు వెళుతున్నారు. బావి నుంచి తోడుకుంటున్న నీళ్లు  మురికిగా ఉంటున్నాయని అవి తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు స్ధానికులు చెపుతున్నారు.