Chintamani Vinayaka : చింతలు తీర్చే‘చింతామణి’ వినాయకుడు

తెలుగు వారు శివరాత్రికి పంచారామాలు దర్శించుకున్నట్లుగా మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాల్లో చింతామణి వినాయకుడి వెనుక ఆసక్తికరమైన పురాణకథనం..

Chintamani Vinayaka : చింతలు తీర్చే‘చింతామణి’ వినాయకుడు

Chintamani Vinayaka

Chintamani Vinayaka At Ashta Vinayaka yatra : తెలుగు వారు శివరాత్రికి పంచారామాలు దర్శించుకున్నట్లుగా మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మొత్తం అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవాలంటే 654 కి.మీ ప్రయాణించాలి. ఈ అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి చింతలను తొలగించే ‘చింతామణి గణపతి’ క్షేత్రం.మహారాష్ట్రలోని షోలాపూర్‌ పుణె మార్గంలో థూర్ గ్రామంలో గణేశుడు చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో వినాయకుడిని ‘చింతామణి’ అనే పేరుతో పూజిస్తారు. ఎక్కడ విఘ్నశ్వరుడిని భక్తితో కొలిస్తే.. వారిని చింతల నుండి విముక్తిని చేస్తాడని భక్తుల నమ్ముతారు. అలా భక్తులు గణనాథుడిని పూజించి తరిస్తారు.

ఈ చింతామణి గణపతి వెనుక ఓ కథ ఉంది.పూర్వ కపిల మహాముని వద్ద కోరిన కోరికలు తీర్చే ఓ ‘చింతామణి’ అనే అమూల్యమైన రత్నం ఉండేదట. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకు ఘనుడు కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడట.
అతడు చాలా దుష్టుడు. ప్రజలు, మునులను ఘనుడు నానా బాధలుపెట్టేవాడు. ఒకసారి అడవిలో వేటకు వెళ్లిన అతడు కపిలముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అతడికి కపిలముని అతిథి సత్కారాలు చేసి భోజనానికి ఆహ్వానించాడు. ‘ఈ ముని ఆశ్రమంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుందని ఆలోచిస్తూ కందమూలాలు, ఆకులు అలములు వడ్డిస్తాడేమో..అంటూ పరాచికాలు ఆడాడు. చులకన చేసి మాట్లాడాడు. కాసేపటి తర్వాత కుటీరం సమీపంలో ఆసనాలు, వెండి పాత్రలు, రకరకాల ఆహారపదార్థాలతో కపిల ముని భారీగా విందు సిద్ధం చేసి..ఓ మండాపాన్ని ఏర్పాటు చేసి దాన్ని చక్కగా అలంకరించి..మహారాజు కొడుకు ఘనుడిని విందుకు ఆహ్వానించాడు.

ఆ వైభవాన్ని చూసి రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశారు? అని ఎంతో ఆశ్చర్యంతో కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని.. ఒకసారి ఇంద్రునికి సాయం చేసినప్పుడు ఆయనకు నాకు చింతామణి అనే అమూల్యమైన రత్నాన్ని ప్రసాదించాడని తెలిపాడు. ఈ రత్నం కోరిన కోరికలు తీర్చే రత్నమని తెలిపాడు.అంతే ఘనుడు మనస్సులో చెడు ఆలోచనకలిగింది. ఆ రత్నాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆశపడ్డాడు.

అడిగినా ముని చింతామణిని ఇవ్వడని భావించి ఆ చింతామణి రత్నాన్ని అపహరించుకుని పోయాడు. ఈ విషయం గుర్తించిన కపిల ముని చాలా బాధపడ్డాడు. అనంతరం ఆపదలను తీర్చే శ్రీమహావిష్ణువు సహాయాన్ని అర్ధించాడు. శ్రీహరి ప్రత్యక్షమై గణేషున్ని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. కపిలముని ఘోర తపస్సు చేసి వినాయకుని ప్రసన్నం చేసుకున్నాడు. జరిగినదంతా విన్న గణేశుడు చింతామణిని తెచ్చి ఇస్తానని కపిల మునికి అభయం ఇచ్చాడు. వినాయకుడి తన పరివారాన్ని వెంటబెట్టుకుని అభిజిత్ మహారాజు రాజ్యానికి చేరుకున్నాడు.

ఘనుడు తండ్రి అభిజిత్ మహారాజు..గణనాధుడితో యుద్ధామా? వద్దు స్వామీ వద్దు..నా కొడుకు చేసిన అపరాధం మన్నించండీ..ఆ చింతామణిని మీకు ఇచ్చేస్తాను అని వేడుకున్నాడు. కానీ పొరగుబోతు అయిన ఘనుడు అహంకారంతో తండ్రి మాటను పెడచెవినపెట్టి గణేషునితో యుద్ధానికి దిగుతాడు. చివరకు తన పరసుతో ఘనుడి శిరస్సును ఖండించిన వినాయకుడు చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి అందజేశాడు.

అయితే..కపిలముని ఆ చింతామణిని గణనాథుని మెడలో వేసి.. ఈ చింతామణి మీదగ్గరే ఉండనివ్వండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని చింతామణి గణనాధుడి పేరుతో కొలుచుకుంటాం స్వామీ అని తెలిపాడు. దానికి వినాయకుడు సరే అని అక్కడే చింతామణి వినాయకుడిగా వెలిసాడు. అలా చింతలతో తనను పూజిస్తే వారి చింతలన్నీ తీరుస్తాను అని వరాలు ప్రసాదించిన గణనాధుడు అక్కడే చింతామణి వినాయకుడిగా వెలిసి భక్తుల పూజలందుకుంటున్నాడు.