Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. రంగంలోకి దిగిన భద్రతా దళాలు

మణిపూర్‌లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.

Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. రంగంలోకి దిగిన భద్రతా దళాలు

Manipur: కొద్ది రోజుల క్రితం మణిపూర్‌ రాష్ట్రంలో తలెత్తిన భారీ హింసాకాండ తగ్గుపడుతుందన్న సమయంలో తాజాగా మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. సోమవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు ఘర్షణకు దిగాయి. స్థానిక మార్గెట్‌లో స్థలం విషయంలో ఈ ఘర్షణ చోటుచేసుంది. ఘర్షణలో రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. ఇటీవల హింసాకాండ భయంతో జనం వదిలివెళ్లిన ఇళ్లకు నిప్పుపెట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే ఆర్మీ, పాలామిటలరీ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఇక ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో తక్షణమే కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చారు.

Nitish Kumar: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన నితీశ్ కుమార్

మణిపూర్‌లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ అల్లర్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, కోట్లాది రూపాయల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శరణార్థ శిబిరాలకు తరలి వెళ్లారు. కాగా, ఘర్షణలకు దిగిన ఇరువర్గాల ప్రతినిధులను కలుస్తానని, హింసతో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు.

Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు