Oxygen Cylinder : ఆక్సిజన్ సిలిండర్‌తో రోడ్డుపై కూలబడ్డ అవ్వ ఫొటో వైరల్.. అసలు నిజం ఇదే..

రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. దేశంలో కరోనా రోగులకు తీవ్రమైన ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అవ్వే అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటున్నారు. అంతా ఆ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు. అయ్యో ఎంత కష్టం వచ్చిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Oxygen Cylinder : ఆక్సిజన్ సిలిండర్‌తో రోడ్డుపై కూలబడ్డ అవ్వ ఫొటో వైరల్.. అసలు నిజం ఇదే..

Woman On Road With Oxygen Cylinder

Woman On Road With Oxygen Cylinder : రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. దేశంలో కరోనా రోగులకు తీవ్రమైన ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అవ్వే అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటున్నారు. అంతా ఆ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు. అయ్యో ఎంత కష్టం వచ్చిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Viral photo of woman on road with oxygen cylinder not recent

కానీ, వాస్తవం ఏంటంటే.. ఆ అవ్వ కరోనా పేషెంట్ కాదని తేలింది. ఆ అవ్వ నిజమే. ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపైన కూలబడటమూ నిజమే. కానీ, కరోనా పేషెంట్ మాత్రం కానే కాదు. నిజానికి ఆ ఫొటో ఇప్పటిది కాదు. మూడేళ్ల క్రితం(2018) నాటిది. అసలప్పుడు కరోనానే లేదు. ఓ మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా.. కొడుకు అంబులెన్స్ కోసం వెళ్లగా.. తల్లిని అలా కూర్చోబెట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో ఆ అవ్వ కూర్చుని ఉంది.

oxygen

అయితే, అప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. కరోనా వల్లే ఈ దుస్థితి అంటూ.. ఆ పిక్ ని కొందరు ఇప్పుడు వైరల్ గా మార్చేశారు. నిజానిజాలు తెలియని వారు.. ఇది నిజమేనేమో అని ఆ ఫొటోని షేర్ చేసి తమ సానుభూతి తెలుపుతున్నారు. వాస్తవానికి ఆ ఫొటోతో జనాలను తప్పుదోవ పట్టించారు. కొందరేమో ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోడీ ప్రభుత్వం వైఫల్యం వల్లే దేశ ప్రజలకు ఈ దుస్థితి పట్టిందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేయాలని కొందరు డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ అమ్మ చేసిన నేరం ఏంటో చెప్పండి.. అని కొందరు పార్టీ నేతలు ప్రధాని మోడీని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు కూడా. చివరికి ఆ ఫొటో ఇప్పటిది కాదని తెలిశాక.. అయ్యో.. అవవసరంగా ఆవేశపడ్డామే అని ఫీల్ అవుతున్నారు.