13 Members On Bike : ఇదేందయ్యా ఇది.. ఏడా చూడలె.. ఒకే బండిపై 13మంది..

ఒక బండి.. దానిపై 12మంది పిల్లలు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వ్యక్తి తన బండిపై 12మందిని ఎక్కించుకున్నాడు. అందరూ పిల్లలే. రోడ్

13 Members On Bike : ఇదేందయ్యా ఇది.. ఏడా చూడలె.. ఒకే బండిపై 13మంది..

13 Members On Single Bike

13 Members On Single Bike : ఒక బండి.. దానిపై 12మంది పిల్లలు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వ్యక్తి తన బండిపై 12మందిని ఎక్కించుకున్నాడు. అందరూ పిల్లలే. రోడ్డుపై దూసుకెళ్తున్నాడు. బైక్ సీటు పైనే కాదు ఆఖరికి చక్రాలు కూడా వదల్లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడో చిన్నారిని కూర్చోబెట్టాడు.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

బైక్ పై ప్రమాదకరంగా పిల్లలను వేలాడదీశాడు. అంతేనా.. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా.. బచ్ పన్ కా ప్యార్ అంటూ పిల్లలతో పాటలు పాడించాడు. ఆ వ్యక్తి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ వెర్రితనం అంటూ మండిపడుతున్నారు. అతడసలు మనిషేనా? అని సీరియస్ అవుతున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

ఆ వ్యక్తి.. పిల్లలను బండిపై కూర్చోపెట్టుకున్న తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. చివరికి తన భుజాలపైనా ఎక్కించుకున్నాడు. అటు ఇటు పిల్లలను వేలాడదీశాడు. రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఇంత ప్రమాదకరంగా బైక్ నడుపుతుంటే పక్కనే మరొకరు వీడియో తీశారు. సరదా కోసం చేశాడో, పాపులారిటీ కోసం చేశాడో తెలీదు కానీ, అతడు చేసిన పిచ్చి పనిని అంతా తప్పుపడుతున్నారు.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ వ్యక్తి ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయాలని, బుద్ధి చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)