Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో

ఢిల్లీలో బైకుపై పారిపోతున్న దొంగను ఒక కానిస్టేబుల్ అత్యంత సాహసంతో బంధించాడు. తన బైకును కింద పడేసి, ఆ దొంగ వెళ్తున్న బైకుకు ఎదురుగా నిలబడ్డాడు. దొంగను బైకుపై నుంచి కింద పడేసి పట్టుకున్నాడు.

Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో

Viral Video: విధి నిర్వహణలో పోలీసులు కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. నేరస్తుల్ని పట్టుకునేందుకు, గొడవల్ని అరికట్టేందుకు.. ఇలా చాలా సార్లు తమ లైఫ్ రిస్క్ చేస్తుంటారు. తాజాగా ఢిల్లీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక దొంగను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న సత్యేంద్ర అనే కానిస్టేబుల్ సాహసంతో దొంగను పట్టుకున్నాడు. సత్యేంద్ర బైకుపై వెళ్తుండగా, ఎదురుగా మరో బైకుపై దొంగ పారిపోతున్నాడు. అది గమనించిన కానిస్టేబుల్ వెంటనే తన బైకును కింద పడేసి, అతడి బైకుకు ఎదురుగా నిలబడ్డాడు. దొంగ బైకుపై వేగంగా ఎదురొస్తున్నా సరే భయపడకుండా అతడి బైకును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ బైక్ కూడా కింద పడిపోయింది. అయినప్పటికీ అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా సాహసంతో గట్టిగా పట్టుకున్నాడు. చాలా కష్టపడి మొత్తానికి ఆ దొంగను పట్టుకోగలిగాడు.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అనాగరిక పాలన.. గే సెక్స్, వ్యభిచారం చేసినందుకు కొరడా దెబ్బలు

ఈ దొంగపై గతంలో అనేక కేసులు కూడా ఉన్నాయి. ఎప్పట్నుంచో తప్పించుకు తిరుగుతున్న అతడిని కానిస్టేబుల్ అత్యంత సాహసంతో బంధించాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.