Viral Video: హుషారుగా డ్రమ్స్ వాయించిన పెళ్లికూతురు.. ఆశ్చర్యంగా చూసిన అతిథులు

పెళ్లి వేడుక జరుగుతుండగా వేదికపై హుషారుగా డ్రమ్స్ వాయించింది ఓ పెళ్లికూతురు. ఆమె టాలెంట్ ను చూసి అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు కేరళ సంప్రదాయ ‘చెందా’ వాయించింది.

Viral Video: హుషారుగా డ్రమ్స్ వాయించిన పెళ్లికూతురు.. ఆశ్చర్యంగా చూసిన అతిథులు

Viral Video

Viral Video: పెళ్లి వేడుక జరుగుతుండగా వేదికపై హుషారుగా డ్రమ్స్ వాయించింది ఓ పెళ్లికూతురు. ఆమె టాలెంట్ ను చూసి అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెళ్లికూతురు కేరళ సంప్రదాయ ‘చెందా’ వాయించింది.

ఆమెతో పాటు ఆ డ్రమ్స్ వాయించే బృందం కూడా వాటిని వాయించింది. గురువాయూర్ దేవాలయంలో ఈ వేడుక జరిగింది. వేదికపైకి వచ్చిన పెళ్లికొడుకు, పెళ్లి కూతురి తండ్రి కూడా డ్రమ్స్ వాయించడం గమనార్హం. పెళ్లికూతురు చాలా ఎనర్జీతో, హావభావాలతో డ్రమ్స్ వాయించిన తీరు అదుర్స్ అనిపిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనూ వేలాది వ్యూస్ వచ్చాయి.

‘‘ఆ పెళ్లికూతురి ముఖంలో అమితానందం కనపడుతోంది. ఆమె హుషారు చూసి చివర్లో ఆమె తండ్రి కూడా వచ్చారు’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పెళ్లికూతురికి హ్యాట్సాఫ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు డ్యాన్స్ చేసే వీడియోలు ఇటీవల బాగా బయటకు వచ్చాయని, అయితే, పెళ్లికూతురు డ్రమ్స్ వాయించిన వీడియో మాత్రం రాలేదని, ఇప్పుడు చూస్తున్నామని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.

Mother’s dream: ‘‘ఎప్పుడు పైలట్ అవుతావు?.. విమానంలో ఎప్పుడు తీసుకెళ్తావు?’ అని 20 ఏళ్ల క్రితం అడిగిన అమ్మ.. ఆ కలను నిజం చేసిన కొడుకు