Viral Videos: చీరకట్టులోనే బుల్లెట్ నడుపుతూ.. గుర్రంపై స్వారీ చేస్తున్న మోనాలిసా.. వీడియో!

మహిళలు ప్రతీరంగంలోనూ ముందుకు సాగుతూ.. తమదైన శైలిలో రాణిస్తున్నారు. మహిళలు విభిన్న రంగాల్లో రాణించడాన్ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటారు. కాలం వేగంగా మారుతోండగా.. ప్రతీ రంగంలోనూ ముందడుగు వేస్తున్న మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Viral Videos: చీరకట్టులోనే బుల్లెట్ నడుపుతూ.. గుర్రంపై స్వారీ చేస్తున్న మోనాలిసా.. వీడియో!

Viral Videos

Monalisa Bhadra: మహిళలు ప్రతీరంగంలోనూ ముందుకు సాగుతూ.. తమదైన శైలిలో రాణిస్తున్నారు. మహిళలు విభిన్న రంగాల్లో రాణించడాన్ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటారు. కాలం వేగంగా మారుతోండగా.. ప్రతీ రంగంలోనూ ముందడుగు వేస్తున్న మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ బుల్లెట్ బండి, ట్రాక్టర్, బస్సు.. గుర్రపు స్వారీ చీరకట్టులోనే చేస్తూ ఓ మహిళ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఏ మాత్రం జంకకుండా.. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా జాహల్ గ్రామానికి చెందిన మోనాలిసా అనే మహిళ సంప్రదాయ చీరకట్టులో నిండుగా కనిపిస్తూ బుల్లెట్‌పై తిరుగుతూ.. ట్రాక్టర్ తోలుతూ.. గుర్రంపై స్వారీ చేస్తూ చీరకట్టులో చెయ్యాల్సిన పనులు ఇవే అంటూ సాగే మూస ప్రచారాలను బద్ధలు కొట్టింది ఆ మహిళ. యూట్యూబ్‌లో మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుని, విభిన్నమై వీడియోలతో వీక్షకుల మనసులు గెలుచుకుంటోంది.

తన భర్త బద్రి నారాయణ్ భద్రా సహకారంతో.. మోనాలిసా భద్రా 2016లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చెయ్యగా.. ప్రస్తుతం 2.26 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మోనాలిసా భర్త బద్రి నారాయణ్ భద్రా క్రియేటివ్ డైరెక్టర్, సామాజిక కార్యకర్త కూడా. తన భర్తే తనకు యూట్యూబ్ చానల్‌ను పరిచయం చేశారని, ఇప్పుడది తనకు ఆదాయం తెస్తున్నట్లు మోనాలిసా చెబుతున్నారు. మోనాలిసా జంతు ప్రేమికురాలు కూడా.