తండ్రి కాబోతున్న కోహ్లీ..ఆ అపురూప క్షణాల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ గుడ్ న్యూస్

  • Published By: nagamani ,Published On : August 27, 2020 / 01:15 PM IST
తండ్రి కాబోతున్న కోహ్లీ..ఆ అపురూప క్షణాల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ గుడ్ న్యూస్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ..ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మలు ఇద్దరూ కలిసి తమ అభిమానులకు శుభవార్తను చెప్పారు. తాము త్వరలో అమ్మానాన్నం కాబోతున్నామని ఆ అపురూప క్షణాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీంట్లో ఆమె బేబీ బంప్‌తో కనిపించింది. త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని తెలిపాడు.

2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని చెప్పాడు. ఈ విషయం తెలిసిన తోటి ఆటగాళ్లు, బాలీవుడ్ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ విషెష్ చెబుతూ సంబర పడిపోతున్నారు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్ళాడు. కాగా ఇటీవలే టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విరుష్క దంపతులు కూడా ఆ లిస్టులో చేరడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

2017, డిసెంబరు 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మని వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ.. తమకి వచ్చే 2021 జనవరిలో బిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇటీవల టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.