కనిపించకపోయినా కరోనాను మనోళ్లు దాటేస్తారు: మోడీ

  • Published By: Subhan ,Published On : June 1, 2020 / 06:11 AM IST
కనిపించకపోయినా కరోనాను మనోళ్లు దాటేస్తారు: మోడీ

కరోనా కనిపించకపోవచ్చు.. కానీ, మన కరోనా వారియర్స్ దానిని అధిగమిస్తారు. అని ప్రధాని మోడీ అంటున్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రధాని వారితో వీడియో కాన్ఫిరెన్స్ తో మాట్లాడారు. ఈ యూనివర్సిటీ నుంచి చాలా మంది మెడికల్ స్టాఫ్ బయటకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇంకా వస్తారని ఆశిస్తున్నా అని మోడీ ప్రసంగించారు. 

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సోమవారం సమావేశం అవుతుంది. లాక్‌డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఫస్ట్ మీటింగ్ ఇదే. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సోమవారానికి నమోదైన కొత్త కేసులు 8వేల 392తో కలిపి దేశ వ్యాప్తంగా లక్షా 90వేల 535కేసులు నమోదైయ్యాయి. అందులో 230మరణాలు ఉన్నాయి. 

దేశంలో ప్రస్తుతం 93వేల 322యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. భారత్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 48.18శాతంగా ఉంది. మొత్తం ప్రపంచంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 61 మిలియన్లను దాటింది. 

దేశాలవారీగా కేసులు.. మరణాలు..:
అమెరికా: 1,790,172 కేసులు, 104,381 మరణాలు.
బ్రెజిల్: 514,849 కేసులు, 29,314 మరణాలు.
రష్యా: 405,843 కేసులు, 4,693 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్: 276,156 కేసులు, 38,571 మరణాలు.
స్పెయిన్: 239,479 కేసులు, 27,127 మరణాలు.
ఇటలీ: 232,997 కేసులు, 33,415 మరణాలు.
భారతదేశం: 190,392 కేసులు, 5,394 మరణాలు.
ఫ్రాన్స్: 189,009 కేసులు, 28,805 మరణాలు
జర్మనీ: 183,410 కేసులు, 8,540 మరణాలు.
పెరూ: 164,476 కేసులు, 4,506 మరణాలు 

Read: క్వారంటైన్ కు వెళ్లాలని అనడంతో ఉరేసుకున్న యువకుడు