ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది – హైకోర్టు

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 11:41 AM IST
ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది – హైకోర్టు

Virus Touched Almost Every Household : దేశ రాజధానిని కరోనా భయపెడుతోంది. తొలుత తగ్గుతున్నట్లు అనిపించినా..క్రమ క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యానికి తోడు..వైరస్ విస్తరిస్తుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వైలైన్స్ ద్వారా ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వ్యాధి ఉన్నట్లు తేలింది. ఢిల్లీలో నిర్వహించిన నాలుగో దఫా సీరో సర్వే ఫలితాలను హైకోర్టు ముందట ప్రభుత్వం ఉంచింది.



ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులున్నట్లు గుర్తించింది. ఢిల్లీ వ్యాప్తంగా సీరో సర్వే జరిగింది. ఇందులో 25 శాతం మంచి ప్రజల శరీరాల్లో వైరస్ రోగ నిరోధకాలు గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. సర్వే నివేదికను హైకోర్టు పరిశీలించింది. కరోనా దాదాపు ప్రతి ఇంటిని కమ్మేసినట్లు కనిపిస్తోందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నడుమ లాక్ డౌన్ ఆంక్షల్ని ఎందుకు సడలిస్తున్నారంటూ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే..ఢిల్లీలో కరోనా ఇంకా పీక్ స్థాయికి చేరుకోలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.