పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణికి రచయిత ఆటో చంద్రన్ సాయం

ఆటో చంద్రన్. పరిచయం అక్కర్లేని పేరు. వృత్తిరీత్యా ఆటో డ్రైవ‌ర్ అయిన చంద్ర‌న్ తన జీవితంలో జరిగిన యధార్థ సంఘ‌ట‌న‌ల‌తో లాక‌ప్ అనే న‌వ‌ల రాశారు. దీని ఆధారంగానే డైరెక్టర్

10TV Telugu News

ఆటో చంద్రన్. పరిచయం అక్కర్లేని పేరు. వృత్తిరీత్యా ఆటో డ్రైవ‌ర్ అయిన చంద్ర‌న్ తన జీవితంలో జరిగిన యధార్థ సంఘ‌ట‌న‌ల‌తో లాక‌ప్ అనే న‌వ‌ల రాశారు. దీని ఆధారంగానే డైరెక్టర్

ఆటో చంద్రన్. పరిచయం అక్కర్లేని పేరు. వృత్తిరీత్యా ఆటో డ్రైవ‌ర్ అయిన చంద్ర‌న్ తన జీవితంలో జరిగిన యధార్థ సంఘ‌ట‌న‌ల‌తో లాక‌ప్ అనే న‌వ‌ల రాశారు. దీని ఆధారంగానే డైరెక్టర్ వెట్రిమార‌న్ త‌మిళంలో విచార‌ణై అనే సినిమా రూపొందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. అలా ఆటో చంద్రన్ పాపులర్ అయ్యారు. ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన పెద్ద మనసుతో అందరి ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం చేశారు ఆటో చంద్రన్.

లాక్‌డౌన్ కారణంగా వ‌ల‌స కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. మరో చోటుకి వెళ్ల అవకాశం లేకపోవడంతో ప‌ని చేసే ప్రాంతంలోనే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కోవై, సింగనల్లూర్‌ ప్రాంతంలో గుడిసెల్లో ఉంటున్నారు. ఆ కుటుంబంలో నిండు గర్భిణి ఉంది. సడెన్ గా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ స‌భ్యులు అంబులెన్స్‌కి కాల్ చేశారు. అయితే అది రావ‌డానికి లేట్ అవుతుండ‌డంతో ప‌క్క‌నే ఉంటున్న ఆటో చంద్ర‌న్‌ని కార్మికులు పిలిచారు. మ‌హిళ నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ప‌రిస్థితిని చూసిన చంద్ర‌న్ ప‌క్క‌నున్న కొంద‌రి సాయంతో ఆమెకి పురుడు పోశారు. ఈ విష‌యాన్ని చంద్ర‌న్ కూతురు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. ఆటో చంద్రన్ పెద్ద మనసుని అంతా అభినందించారు.

×