దాల్ లేక్ లో మోడీ షికారు

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2019 / 12:50 PM IST
దాల్ లేక్ లో మోడీ షికారు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం(ఫిబ్రవరి-3,2019)వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ శ్రీనగర్ లోని దాల్ లేక్ లో బోటులో పర్యటించారు. అంతకుముందు బందిపొరా, గందేర్బాల్, అవంతిపుర లోని వివిధ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. విజయపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ..కాశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

కేంద్రప్రభుత్వం కర్తవ్యబద్ధతతో కశ్మీరీ పండిట్ల ఆత్మాభిమానం, గౌరవం, హక్కుల అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హింస, ఉగ్రవాదం చెలరేగిన కాలంలో కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్లు వదిలి బయటకి పారిపోవలసి వచ్చిందని, ఇది భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని తెలిపారు. శ్రీనగర్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మోడీ.. తన ప్రసంగాన్ని  కశ్మీరీ భాషలో ప్రారంభించారు.  వీరమరణం పొందిన నజీర్ అహ్మద్ వాణికి, దేశాన్ని రక్షించేందుకు, శాంతి నెలకొల్పేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు ఈ సందర్భంగా మోడీ తెలిపారు.నజీర్ అహ్మద్ వాణికి కేంద్రం  అశోక్ చక్ర అవార్డు ప్రకటించింది.