27న చిన్నమ్మ విడుదల..పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్న సీఎం

27న చిన్నమ్మ విడుదల..పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్న సీఎం

VK Sasikala తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా పేరొందిన ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు శశికళ న్యాయవాది రాజా సెంథూర్​ పాండ్యన్​కు మంగళవారం తెలియజేశారు. శశికళ విడుదలకు సంబంధించి జైలు అధికారుల నుంచి సమాచారం అందిందని సెంథూర్ పాండ్యన్ తెలిపారు.

కాగా, అక్రమాస్తుల కేసులోసుప్రీంకోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తవుతున్నందున ఆమె విడుదలవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్​లో ట్రయల్​ కోర్టు తీర్పునిచ్చింది. రూ.10కోట్ల జరిమానాను శశికళ గతేడాది నవంబర్​లోనే చెల్లించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకూ శశికళ జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన.. తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేస్తున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన రోజే శశికళ చెన్నైకి వెళ్తుందా? లేదా? అనే విషయంపై స్పషత లేదు. మరికొద్ది నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శశికల విడుదల ఇప్పుు తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జ‌య‌ల‌లిత హ‌యాంలో అన్నాడీఎంకేలో శ‌క్తిమంత‌మైన వ్య‌క్తిగా శ‌శిక‌ళ ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లోకి వ‌స్తే కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. అయితే, సీఎం ఎడ‌పాడి కే ప‌ళ‌నిస్వామి మాత్రం అన్నాడీఎంకేలోకి శ‌శిక‌ళ‌ను అనుమ‌తించ‌బోమ‌ని మంగ‌ళ‌వారం తేల్చేశారు.