ఘోస్ట్ రైడర్‌గా పల్సర్‌పై స్టంట్.. పిచ్చికి పరాకాష్ట ఈ వీడియో!

  • Published By: vamsi ,Published On : August 30, 2020 / 12:01 PM IST
ఘోస్ట్ రైడర్‌గా పల్సర్‌పై స్టంట్.. పిచ్చికి పరాకాష్ట ఈ వీడియో!

పిచ్చి పలు రకాలు అంటారు కదా? ఇదిగో వీరి పిచ్చి కూడా అటువంటిదే.. ఇది పిచ్చి అనే కంటే అంతకుమించిన పదం వాడవచ్చు వీరి చేష్టలకు.. పిచ్చి చేష్టలకు పరాకాష్ట అయిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. బజాజ్ పల్సర్ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన స్పోర్ట్స్ బైకులలో ఒకటి. ఇటీవల, కంపెనీ కొత్తగా అప్‌డేట్ చేసిన బిఎస్ 6 ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదలైన పల్సర్ 220 ఉపయోగించి ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ఘోస్ట్ రైడర్‌లో సీన్‌ని షూట్ చేయబోయారు కొంతమంది తెలివి తక్కువ చదువుకున్నవాళ్లు. ఘోస్ట్ రైడర్‌ చిత్రంలో హీరో, ప్రసిద్ధ నటుడు నికోలస్ కేజ్ క్రూయిజర్ బైక్ నడుపుతుంటారు.

అందులో ఘోస్ట్ రైడర్ రూపంలోకి వచ్చినప్పుడు, బైక్ నుంచి మంటలు వస్తుంటాయి. ఇదే విధమైన చర్యను కొంతమంది యువకులు కూడా చేశారు. దీనిలో అతను బజాజ్ పల్సర్ బైక్‌కు నిప్పంటించి ఘోస్ట్ రైడ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇటువంటి చర్య ప్రమాదకరమైంది.

ఈ వీడియోను మిస్టర్ ఇండియన్ హ్యాకర్ ఛానల్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో, బజాజ్ పల్సర్ 220 బైక్ రెండు చక్రాలకు పెట్రోల్‌తో నానబెట్టిన దుస్తులను చుట్టి, ఇద్దరు యువకులు బైక్‌పై కూర్చుని బైక్‌ను నడిపారు. బైక్ నడిపిన వెంటనే బైక్ చక్రాలు నిప్పంటించారు. దీని వలన బైక్ రెండు చక్రాలు మంటల్లో కాలడం ప్రారంభం అయ్యింది.

బైక్ కొద్ది నిమిషాల దూరంలోకి వెళ్లగా మంటలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత బైక్ వెనుక సీటుపై కూర్చున్న యువకుడు బైక్ నుంచి దూకి బైక్ డ్రైవర్ కూడా కొన్ని సెకన్ల తర్వాత బైక్ నుంచి పక్కకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో మొత్తం చాలా భయానకంగా ఉంది. బైక్ నుంచి బయలుదేరిన తరువాత, బైక్ రెండు చక్రాలలోనూ మంటలు వేగంగా వ్యాపించడం ప్రారంభించాయి. కింద పడేసిన తర్వాత బైక్‌పై యువకులు నీటిని చల్లారు.

ఈ రకమైన చర్య చాలా ప్రమాదకరమైనది. సినిమా సన్నివేశాలను దృష్టిలో ఉంచుకుని స్టంట్ చేయడానికి ప్రయత్నించవద్దు అని నిపుణులు చెబుతున్నారు. సినిమాలలో ఇటువంటి సన్నివేశాలను నిపుణుల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక స్టంట్ మ్యాన్ చేస్తారు. ఇది కాకుండా, ఇప్పుడు VFX కూడా ఉపయోగిస్తారు. కానీ కుర్రకారు ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం. దయచేసి ప్రయత్నించవద్దు.