వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్

టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. క‌నీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్‌ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణ‌యించింది. గ‌తంలో ఈ

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 03:38 PM IST
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్

టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. క‌నీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్‌ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణ‌యించింది. గ‌తంలో ఈ

టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. క‌నీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్‌ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణ‌యించింది. గ‌తంలో ఈ ప్లాన్ రూ.35 గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.20 చేశారు. జియో, ఎయిర్‌టెల్ తర్వాత 3వ స్థానంలో ఉన్న వొడాఫోన్‌-ఐడియా తన క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోకుండా ఉండేందుకు ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వొడాఫోన్‌-ఐడియా సిమ్‌ల‌ను వాడ‌కుండా ఇనాక్టివ్‌గా ఉన్న వారిని కూడా తిరిగి యాక్టివ్ చేయించేందుకు ఈ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. రూ.20 ప్లాన్‌కు వాలిడిటీని 28 రోజులు.

ఎయిర్ టెల్ విషయానికి వస్తే కనీస ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ రూ.35గా ఉంది. 30 రోజుల పాటు ఔట్ గోయింగ్ సర్వీస్, 45 రోజుల వరకు ఇన్ కమింగ్ సౌకర్యం ఉంటుంది. జియో విషయానికి వస్తే రూ.98 ప్లాన్ అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లు, 2జీబీ డేటా ఇస్తారు. జియో వచ్చాక భారత టెలికాం రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. జియో డేటా ఆఫర్లకి కస్టమర్లు బాగా అట్రాక్ట్ అయ్యారు. జియో నుంచి పోటీని మిగతా టెలికాం సంస్థలు తట్టుకోలేకపోయాయి. కోట్ల సంఖ్యలో వినియోగదారులు జియో నెట్ వర్క్ కి జంప్ అయ్యారు.