జాబ్ మానకూడదని ఎక్స్‌ట్రా శాలరీ ఇస్తున్న వొడాఫోన్ ఐడియా

జాబ్ మానకూడదని ఎక్స్‌ట్రా శాలరీ ఇస్తున్న వొడాఫోన్ ఐడియా

vodafone idea:సీనియర్ లెవల్ ఉద్యోగులు సంస్థను వదిలేసి వెళ్లిపోవడానికి రెడీ అవడంతో వారిని అట్టిపెట్టుకునే క్రమంలో వొడాఫోన్ ఐడియా నెల జీతం అదనంగా ఇవ్వాలని ఫిక్స్ అయింది. మార్కెటింగ్ డైరక్టర్ అవనీశ్ ఖోస్లాను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గానూ ప్రమోట్ చేశారు. రెండేళ్లుగా ఖాళీ ఉంటున్న పోస్టును భర్తీ చేశారు.

వొడాఫోన్ ఐడియా 2021 మార్చి 31వరకూ ఉద్యోగులు వెళ్లకుండా ఉంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ నష్టాలు, 4జీ నెట్ వర్క్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న సంస్థ నుంచి సీనియర్లు వెళ్లిపోవాలనే నిర్ణయం వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి.




రీసెంట్ గా నష్టాలను పూడ్చుకునే క్రమంలో టెల్కో.. గ్రాస్ రెవెన్యూ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తుంది. ఆ సీనియర్ లెవల్ ఉద్యోగుల్లో ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశాంత్ వోరా, మాజీ లీగల్ హెడ్ కుమార్ దాస్, చీఫ్ టెక్నాలజీ సెక్యూరిటీ ఆఫీసర్ అమిత్ ప్రధాన్, ఎక్స్ బ్రాండ్ ఆఫీసర్ కవితా నాయర్ లు కూడా ఉన్నారు.

వొడాఫోన్ ఐడియా మేనేజరియల్ టాలెంట్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. ఎగ్జిక్యూటివ్స్ సంస్థను వదిలివెళ్లిపోవడంతో కస్టమర్ సర్వీస్ క్వాలిటీ కూడా కాస్త తగ్గింది. ఫలితంగా పెటెన్షియల్ సబ్‌స్క్రైబర్, రెవెన్యూ లాసెస్ అనేవి భారీగా కనిపించాయి.



పోటీగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ధాటికి 4జీ కవరేజి ఇవ్వడంలో ఫెయిల్ అయింది. ఈ క్రమంలో దాదాపు 8మిలియన్ కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ మార్కెట్ షేర్ కూడా 22బేస్ పాయింట్లు పడిపోయింది. సీనియర్లను కాపాడుకునే క్రమంలో అదనపు జీతాలు ఇచ్చి వారిని ఉంచుకునే ప్రయత్నం చేస్తున్న వొడాఫోన్ ఇండియా సక్సెస్ అవుతుందో.. లేదో చూడాలి.