Vodafone కు భారీ ఊరట

  • Published By: madhu ,Published On : September 26, 2020 / 07:41 AM IST
Vodafone కు భారీ ఊరట

Vodafone కు అంతర్జాతీయ కోర్టులో భారీ ఊరట లభించింది. పన్ను విధానంలో రూ. 22 వేల 100 కోట్ల నోటీసును భారత ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది.



దీనిపై వొడాఫోన్ స్పందించింది. ప్రస్తుతం పత్రాలను పరిరిశీలించడం జరుగుతోందని, ఈ తీర్పుకు భారతదేశం కట్టుబడి ఉంటుందా ? లేదా ? అనేది తెలియడం లేదని వెల్లడించింది.



తీర్పును ప్రభుత్వం పరిశీలిస్తోందని, అన్ని అంశాలను జాగ్రత్తగా చూడడం జరుగుతోందని ఆర్థిక శాఖ వెల్లడించింది. రూ. 30 కోట్ల వ్యయం, రూ. 45 కోట్ల పన్ను రీ ఫండ్ కలిపి మొత్తం రూ. 75 కోట్లకే ప్రభుత్వం చెల్లింపులు పరిమితం కావొచ్చని తెలుస్తోంది.



వొడాఫోన్ కు అయిన న్యాయ ఖర్చుల్లో 60 శాతం, ప్యానెల్ లో ఆర్బిట్రేటర్ ను నియమించుకున్నందుకు వొడాఫోన్ భరించిన 6000 యూరోల్లో సగం భారత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అంచనా.



హచిసన్ వాంపోవాకు చెందిన మొబైల్ ఫోన్ వ్యాపారంలో 67 శాతం వాటాను వొడాఫోన్ 1100 కోట్ల డాలర్లతో 2007లో కొనుగోలు చేసింది. మూలధన లాభాలపై విధించిన రూ. 7,990 కోట్లు పన్ను నోటీసును నెదర్లాండ్స్ – భారత్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐటీ) సవాల్ చేసింది.