తీవ్రవాదుల బాంబు కంటే ఓటు పవర్‌ఫుల్

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 05:59 AM IST
తీవ్రవాదుల బాంబు కంటే ఓటు పవర్‌ఫుల్

ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రానిప్‌లోని నిశన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు.

ఉగ్రవాదుల ఆయుధం ఐఈడీ అయితే, ప్రజాస్వామ్య ఆయుధం ఓటర్ ఐడీ అని ప్రధాని మోడీ అన్నారు. ఐఈడీ(ఇంప్ర‌వైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్స్ డివైస్‌) బాంబుల క‌న్నా.. ఓట‌రు ఐడీ అత్యంత శ‌క్తివంత‌మైన‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు. మ‌న ఓట‌రు ఐడీల శ‌క్తి అంద‌రూ అర్థం చేసుకోవాల‌న్నారు. కుంభ‌మేళాలో న‌దీ స్నానం చేసిన త‌ర్వాత ఎంత ప‌విత్రంగా భావిస్తామో, అలాగే ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన త‌ర్వాత అంతే ప‌విత్రంగా ఫీల‌వుతామ‌ని మోడీ అన్నారు. నేను నా ఓటు హక్కు వినియోగించుకుని నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఓటు ఎవరికి వేయాలో ప్రజలకు బాగా తెలుసు అని మోడీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలన్నారు.