బీహార్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 07:20 AM IST
బీహార్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం

second phase of Bihar Assembly polls బీహార్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఇవాళ(నవంబర్-3,2020)ప్రారంభమైంది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ రెండో దశలో భాగంగా 17జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ బూత్ ల దగ్గర ఓటర్లు సామాజిక దూరం పాటిస్తున్నారు.



ఆర్జేడీ నాయకుడు మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో సహా మొత్తం 1463మంది రెండో దశ పోలింగ్ బరిలో నిలిచారు.



https://10tv.in/bihar-153-crorepatis-in-first-phase-poll-fray/
కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…అక్టోబర్-28,2020న తొలి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ(నవంబర్-3) రెండో దశలో భాగంగా 94స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.



ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్‌జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.