Aryan Khan Case : ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ లో వాంఖడే పాత్ర..సూత్రధారి బీజేపీ నేత!

ఆర్యన్​ ఖాన్ డ్రగ్స్​ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని మాలిక్ తెలిపారు. ఈ కేసు

Aryan Khan Case : ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ లో వాంఖడే పాత్ర..సూత్రధారి బీజేపీ నేత!

Malik

Aryan Khan Case: ఆర్యన్​ ఖాన్ డ్రగ్స్​ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని మాలిక్ తెలిపారు. ఈ కేసు డ్రగ్స్​కు సంబంధించింది కాదని కిడ్నాప్​, డబ్బు డిమాండ్​కు సంబంధించిందన్నారు. ఆర్యన్ ఖాన్ ‘కిడ్నాప్’ కుట్రలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారి సమీర్ వాంఖడే పాత్ర ఉందని ఆదివారం ముంబైలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాలిక్ ఆరోపించారు.

వాంఖేడే సెటిల్మెంట్ల కోసం సొంతంగా తన ప్రైవేటు ఆర్మీ ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో జర్నలిస్టు ఆర్‌కె బజాజ్, లాయరు ప్రదీప్ నంబియార్, బీజేపీ యువమోర్చా మాజీ నేత మోహిత్ భారతీయ కాంబోజ్ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ కుట్ర సూత్రధారి బీజేపీ నేత “మోహిత్ భారతీయ కాంబోజ్” అని మాలిక్ అన్నారు. ముంబై శివార్లలోని ఓషివారలోని ఓ స్మశాన వాటికి వద్ద మోహిత్ ను వాంఖడే కలిశారని, ఏ విధంగా ఆర్యన్‌ను కిడ్నాప్ చేయాలి?డబ్బులు డిమాండ్ చేయడం వంటి పలు అంశాలను మాట్లాడుకున్నారని మాలిక్ ఆరోపించారు. వాళ్లిద్దరికి ముందునుంచే సాన్నిహిత్యం ఉందన్నారు.

ప్లాన్ ప్రకారమే ఆర్యన్ ఖాన్​ను క్రూయిజ్ షిప్​లో పార్టీకి తీసుకెళ్లారని నవాబ్ మాలిక్ తెలిపారు. ఆర్యన్​ ఖాన్​ కాకుండా.. ఇద్దరు ఇతర వ్యక్తులు టికెట్ కొని అతన్ని పార్టీకి తీసుకువెళ్లినట్లు ఆరోపించారు. అందువల్లే ఇది కిడ్నాప్​, డబ్బు డిమాండ్​కు సంబంధించిన కేసు అని మాలిక్ అన్నారు. ముందు ఆర్యన్ ఖాన్ అరెస్టును చూపలేదని… ఆర్యన్‌ను తీసుకువెళ్లి అతడి తండ్రి షారూక్‌ ఖాన్ తో సమీర్‌ వాంఖడే, మోహిత్‌ కాంబోజ్‌ 25 కోట్లకు బేరానికి దిగారని.. తరువాత రూ 18 కోట్లకు రాజీకి వచ్చారన్నారు. ముందుగా షారూక్ నుంచి అరకోటి తీసుకున్నారని ,అయితే రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి ఆర్యన్‌తో కలిసి దిగిన సెల్ఫీ వెలుగులోకి వచ్చిందని, దీనితో కిడ్నాప్ కుట్ర విఫలం అయిందని మంత్రి ఆరోపించారు.

షారూక్ రూ 50 లక్షలు ఇచ్చి ఉండటంతో కేసులో తను కూడా బాధితుడు అవుతాడని భయంతో పోలీసులకు ఈ విషయాలు చెప్పడం లేదని మంత్రి తెలిపారు. ఆర్యన్ ఖాన్​ను అరెస్ట్​ చేసినప్పటి నుంచి షారుక్​కు బెదిరుపులు మొదలయ్యాయని.. ఈ విషయాలేవీ బయటకు చెప్పొద్దని కూడా సూచించినట్లు నవాబ్ మాలిక్​ వివరించారు. ఇప్పటికైనా షారుక్ ఖాన్ ఈ అన్ని అంశాలపై మౌనం వీడాలని, అన్యాయానికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న పోరుకు మద్దతు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు మంత్రి తెలిపారు.

ALSO READ Satyapal Malik : జంతువు చనిపోతే సంతాపాలు ప్రకటించిన ఢిల్లీ నేతలు 600మంది రైతులు చనిపోతే పట్టించుకోరా