Loan ఇస్తే Train కొంటా.. టెలికాలర్‌ను ఆడుకున్న Customer

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 10:04 AM IST
Loan ఇస్తే Train కొంటా.. టెలికాలర్‌ను ఆడుకున్న Customer

కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ సమయంలో రైలు గురించి జరిగిన పాత జోక్ ఒకటి వైరల్ అయి నవ్వులు పుట్టిస్తుంది. ఫిబ్రవరిలో ఓ యూట్యూబ్ ఛానెల్ కాల్ రికార్డింగ్ ఆడియోను అప్‌లోడ్ చేయడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

మీరూ ఈ సంభాషణ విని.. నవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి. 

టెలికాలర్: హలో గుడ్ ఆఫ్టర్ నూన్ సార్
హలో గుడ్ ఆఫ్టర్ నూన్ జీ
టెలికాలర్: నేను నిషా మాట్లాడుతున్నాను. HDFCసంబంధిత బ్యాంకు నుంచి చేస్తున్నాను. ఫండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు ఏదైనా లోన్ కావాలా.. బిజినెస్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్ లాంటివేమైనా.
అవును లోన్ కావాలి.
టెలికాలర్: ట్రైన్ కొనుక్కోవాలా. ఎంత కావాలి.
రూ.300 కోట్లు
టెలికాలర్: రూ.300 కోట్లా. సార్. ఏదైనా లోన్ రన్నింగ్ లో ఉందా.. ఈఎమ్ఐ కడుతున్నారా..
అవును. సైకిల్ లోన్. హీరో సైకిల్ తీసుకున్నా.
టెలికాలర్: సైకిల్ లోన్.. ఎంత అమౌంట్
రూ.1600రూపాయలు.
టెలికాలర్: మీ పేరు ఏంటి సార్. 
చరణ్ జీత్ సింగ్.
టెలికాలర్: బిజినెస్ చేస్తారా మీరు
అవును. 
టెలికాలర్: ఏది..
సమోసాల బండి.
టెలికాలర్: సమోసాలా.. టర్నోవర్ ఎంత ఉంటుంది. 
రోజుకు వంద.. 150అమ్ముతా
టెలికాలర్: సమోసాల గురించి అడగడం లేదు. టర్నోవర్ గురించి.

టర్నోవర్ అంటే ఏంటి మేడమ్.
టెలికాలర్: రోజుకు ఎంత అమ్ముతారు. 
రోజుకు 100 లేదా 150అమ్ముతాను ఒక్కొక్కటి 10రూపాయలు.
టెలికాలర్: మొత్తం అమ్మకాలు
రోజుకు.. రూ1500
టెలికాలర్: ఈ వ్యాపారం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు. 
చాలా ఏళ్లే అవుతుంది.
టెలికాలర్: ఎక్కడ ఉంటారు.
జంగ్ పూరీ. 
టెలికాలర్: జంగ్ పూరీ. మీది.. 
అవును
టెలికాలర్: ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు. 
అకౌంట్ లేదు మేడమ్.
టెలికాలర్: ఇంతకుముందు మీరేం చేసేవాళ్లు. 
ఇంతకంటే ముందు నిద్రపోయాను మేడమ్.
టెలికాలర్: మీ ఆఫీసు ఎక్కడ ఉంటుంది సర్. 
జంగ్ పూరీ
టెలికాలర్: జంగ్ పూరీలో ఉంటుందా..
అవును.
టెలికాలర్: ఓకే సార్.. మా సీనియర్ తో చర్చించి చెప్తాను. 
కొంచెం దగ్గరుండి అప్రూవ్ చేయించండి. ప్లీజ్. 
టెలికాలర్: హా సరే.

Read: ఇంజనీర్ పజిల్ ని సైతం ఛేదించిన ఉడతలు: వైరల్ వీడియోకు నెటిజన్స్ ఫిదా