పోలీసులపైకి గ్రామస్తుల రాళ్ల దాడి..క్రిమినల్ పరార్

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 05:24 PM IST
పోలీసులపైకి గ్రామస్తుల రాళ్ల దాడి..క్రిమినల్ పరార్

పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడిస్తున్నారు. అరెస్టు చేసిన నాసిరుద్దీన్ అలియాస్ కాలేను తీసుకెళ్లే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళలు, గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.

ఘజియాబాద్ లోని బదర్ పూర్ గ్రామంలో ఉన్న సెలూన్ నుంచి కాలేను యూపీ పోలీసు టీం గురువారం అరెస్టు చేసింది. పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను వాంటెండ్ అని పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసి తిరిగి తీసుకొని వస్తుండగా…గ్రామస్తులు ప్రతిఘటించారు. రాళ్ల దాడి చేస్తూ..వాహనాన్ని ముందుకు తీసుకెళ్లకుండా చేశారు.

ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అంతా గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్తగా ఉండడం చూసిన కాలే..అక్కడి నుంచి పరార్ అయ్యాడు. 2008లో నేర ప్రపంచంలోకి ఇతను అడుగు పెట్టాడు. గత ఏడాది అరెస్టు నుంచి తప్పించుకున్నాడు.

అనంతరం కాలే..చోరీుల, స్నాచింగ్ ముఠాతో సంబంధాలు ఏర్పరచుకుని..పని చేయడం ప్రారంభించాడు. దీనిని వదిలిపెట్టి..అక్రమ ఇసుక తవ్వకాలతో సంబంధం ఉన్న మరొక ముఠాతో పని చేయడం స్టార్ట్ చేశాడు. గత సంవత్సరం ఐదు ఒంటెలను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అరెస్టు నుంచి తప్పించుకున్నాడు.

Badarpur ప్రాంతానికి ఇతను వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ..గ్రామస్తులు దాడి చేయడంతో మరలా తిరిగి తప్పించుకున్నాడు. గ్రామస్తులు ఎక్కువ మంది ఉండడంతో తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమి చేయలేకపోయారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ నీరజ్ కుమార్ వెల్లడించారు. పోలీసులపైకి దాడి జరిపిన వారిని గుర్తించి పట్టుకొనేందుకు తాము ఆరు టీమ్స్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమీమ్, అస్లాం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.