ఫేస్‌బుక్ వాడే వారికి వార్నింగ్, అలా చేస్తే మోసపోయినట్లే

ఫేస్‌బుక్ వాడే వారికి వార్నింగ్, అలా చేస్తే మోసపోయినట్లే

warning for facebook users: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. కేటుగాళ్లు ఇప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ల మీద పడ్డారు. ఫేస్ బుక్ వేదికగా చీటింగ్ చేస్తున్నారు. ముందుగా ఎఫ్ బీలో ఓ వ్యక్తి వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పేరు మీద నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బు అవసరం ఉందంటూ అతడి ఫ్రెండ్ లిస్టులోని వ్యక్తులకు మెసేజ్ చేస్తున్నారు. నిజమే అని నమ్మితే అడ్డంగా మోసపోయినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఓ వ్యక్తి ఇప్పటికే మీ ఫ్రెండ్ లిస్టులో ఉండి, మరోసారి అతని పేరు మీద రిక్వెస్ట్ వస్తే ఓకే చేయకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ సమస్య ఎదురవుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేదు. అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత డబ్బు అడగటం స్టార్ట్ చేస్తున్నారు. కొందరు అమాయకులు.. నిజమేనేమో అని నమ్మేసి డబ్బు ఇచ్చి మోసపోతున్నారు.

”నాకు అర్జెంట్ ఉంది. కొద్దిగా డబ్బు అవసరం ఉంది. ఎలాగైనా సాయం చేయి, మళ్లీ ఇచ్చేస్తా”…అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ లు పంపుతారు. మొహమాటం పడుతున్నాడేమో.. అందుకే నేరుగా అడక్కుండా ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పంపాడనుకుని.. అడిగినంత కాకపోయినా.. కొద్దిగానైనా డబ్బు ఇచ్చామో.. ఇక అంతే సంగతులు. ఎందుకంటే…అది ఫేక్ అకౌంట్. డబ్బు అడిగింది ఎవడో కేటుగాడు.

ఫేస్ బుక్ లో ఒకే పర్సన్ పేరు మీద చాలా ఖాతాలు ఉంటున్నాయి. అందులో ఏది అసలైనది అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే. అలాగే మన పేరు మీద మరొకరు ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసి వాడేస్తుంటారు. ఇలా మీ పేరు మీద ఫేస్ అకౌంట్ ఉన్నట్లు గుర్తించారా? ఆ ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను ఎలా డెలీట్ చేయాలో తెలుసుకుందాం.

నకిలీ ఖాతాను తొలగించండి ఇలా…

* నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేయాలి.

* నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి. దానిపై క్లిక్ చేయాలి.

* రిపోర్ట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

* అందులో 20 మందితో ఈ పోస్టును డిలీట్ చేయండి అని టైప్ చేయాలి.

* ఇది ఫేస్ బుక్ గుర్తించి.. ఆ ఖాతాను డిలీట్ చేసేస్తుంది.