మొబైల్ యూజర్లకు వార్నింగ్, బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్యూఆర్(QR) కోడ్ స్కాన్ పై పడింది. క్యూఆర్ కోడ్ స్కాన్ పేరుతో మొబైల్ యూజర్లను అడ్డంగా దోచేస్తున్నారు.

మొబైల్ యూజర్లకు వార్నింగ్, బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

warning for mobile users: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్యూఆర్(QR) కోడ్ స్కాన్ పై పడింది. క్యూఆర్ కోడ్ స్కాన్ పేరుతో మొబైల్ యూజర్లను అడ్డంగా దోచేస్తున్నారు. ఆ నెట్ వర్క్ ఈ నెట్ వర్క్ అన్న తేడా లేదు, దాదాపు అన్ని టెలికాం నెట్ వర్క్ యూజర్లు మోసపోయారు. రోజూ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం విభాగం అలర్ట్ అయ్యింది.

మొబైల్ యూజర్లను హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. ఈ మేరకు యూజర్ల ఫోన్లకు మెసేజ్ లు పంపింది. ”హెచ్చరిక..ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు జాగ్రత్త వహించండి. ఆర్థిక మోసాలను నివారించడానికి తెలియని వ్యక్తులు పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయొద్దని సూచన” అంటూ టెలికాం విభాగం మేసేజ్ పంపుతోంది.

ఇటీవల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓ మహిళ ఏకంగా రూ.3లక్షలు పొగొట్టుకుంది. తనకు ఓ బుక్ కావాలని అమెజాన్‌ ఆన్‌లైన్‌లో ఒక మహిళ ఆర్డర్ చేసింది. రోజులు గడుస్తున్నా తాను ఆర్డర్ చేసిన బుక్ డెలవరీ కాలేదు. దీంతో గూగుల్‌లో సెర్చ్ చేసి అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్‌కు మహిళ కాల్ చేసి తన సమస్యను వివరించింది. వస్తువు స్టాక్ లేదని డబ్బులు రిటర్న్ చేస్తామని ఆమెను నేరగాళ్లు నమ్మించారు.

తాము పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆమెకు నేరగాళ్లు వివరించారు. కొంతసేపటి తర్వాత వారు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆమె బ్యాక్ ఖాతా నుంచి రూ.3 లక్షలను మోసగాళ్లు కాజేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్టు ఆ మహిళ ఫోన్‌కు బ్యాంకు నుంచి మెస్సేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.