Wash Womens Clothes : రేప్ కేసు.. మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచా

Wash Womens Clothes : రేప్ కేసు.. మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం

Wash Womens Clothes

Wash Womens Clothes : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

బీహార్ రాష్ట్రంలోనే అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ కేసులో స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశం చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది.

Long Covid : ఈ 4 గ్రూపుల వారికి అత్యధిక ప్రమాదం

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బీహార్ లోని ఓ కోర్టు వింత కండీషన్ తో బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక 6 నెలల పాలు గ్రామంలోని 2వేల మంది మహిళల బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. మధుబని జిల్లాలో లలన్ కుమార్ అనే లాండ్రీ షాపు నడిపే వ్యక్తి రేప్ కేసులో జైలుకెళ్లాడు. తాజాగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, పాత క్రిమినల్ కేసులు ఏమీ లేనందున వింత షరతు విధించి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జంజర్ పూర్ అదనపు సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ ఈ కండీషన్ తో కూడిన బెయిల్ ఇచ్చారు.

లలన్ తన గ్రామానికి చెందిన మహిళపై ఏప్రిల్ 17న లైంగిక దాడి చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏప్రిల్ 19న లలన్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి లలన్ జైల్లోనే ఉన్నాడు అని డిఫెన్స్ లాయర్ పరశురామ్ మిశ్రా చెప్పారు.

Student Suicide : ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

‘అదనపు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశాము. జైల్లో లలన్ మంచి ప్రవర్తన, క్షమాపణ చెప్పడాన్ని పరిగణలోకి తీసుకుని నా క్లైంట్ కు బెయిల్ ఇచ్చింది. గ్రామానికి చెందిన 2వేల మంది మహిళల దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాలని కోర్టు కండీషన్ పెట్టింద’ అని లాయర్ చెప్పారు.

వింత కండీషన్ పెట్టడమే కాదు.. ఆ బెయిల్ కాపీని కోర్టు గ్రామ పెద్ద నసిమా ఖాటూన్ కు పంపింది. లలన్ ఉచితంగా బట్టలు ఉతికి, ఇస్త్రీ చేస్తాడో లేదో కనిపెట్టుకుని ఉండాలని గ్రామ పెద్దకు చెప్పింది. మహిళల బట్టలు ఉతికేందుకు లలన్ డిటర్జెండ్ పౌడర్, సోపులు, ఐరన్ బాక్స్ కొనుక్కోవాలని కోర్టు చెప్పింది.

“ఇది కోర్టు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇది మహిళలను గౌరవించాలనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే స్త్రీ వ్యతిరేక స్వభావం కలిగిన పురుషుల మనస్సులో అపరాధ భావనను కూడా సృష్టిస్తుంది ” అని గ్రామపెద్ద నసీమా ఖాటూన్ అన్నారు. “కోర్టు ఆదేశాన్ని అమలు చేయడానికి నిందితుడి రోజువారీ పనిని నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. మా గ్రామంలో 425 మంది మహిళలు ఉన్నారు. 2వేల సంఖ్యను సాధించే వరకు ప్రతి స్త్రీ రొటేషన్‌లో బట్టలు ఇస్తుంది” అని ఆమె తెలిపారు.

అంతేకాదు లలన్ సేవకు సంబంధించిన నివేదికను గ్రామ పెద్ద సమర్పించనుంది. లలన్ తన పనిని ఆరు నెలల్లో పూర్తి చేయాలి. ఆపై గ్రామపెద్ద నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికెట్లు సేకరించి కోర్టుకి సమర్పించాల్సి ఉంది.