నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 06:46 AM IST
నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది

నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది అంటున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆసుపత్రిలో తన పని తానే చేసుకుంటున్నానని తెలిపారు. ఆయన కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచే విర్చువల్ కేబినెట్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కరోనా సోకిన వ్యక్తులు తమ బట్టలను ఉతకడం కోసం ఇతరులకు వేయరాదని, అందువల్ల తన బట్టలను తానే ఉతుక్కుంటున్నానని తెలిపారు. ఇలా చేయడం ఎంతగానే ఉపయోగపడుతుందని, గతంలో తన చెయ్యికి శస్త్ర చికిత్స జరిగిందన్నారు.



దీనికారణంగా పిడికిలి బిగించడానికి చాలా కష్టమయ్యేదని, కానీ..ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. చిన్న చిన్న పనులు మనే చేసుకుంటే బాగుంటుందన్నారు సీఎం చౌహాన్. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు చౌహాన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా వరుసగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ పరిస్థితి నిలకడగానే ఉందని, స్వల్పస్థాయిలో దగ్గు మినహా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది.



రోజురోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ఇప్పటి వరకు 28 వేల 589 కరోనా కేసులు నమోదయ్యాయి. అందుో 7 వేల 978 యాక్టివ్ కేసులున్నాయి. 820 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు.