GST – Nirmala Sitharaman ‘జీఎస్టీ పరిధిలో వాటిని చేర్చడం సరైన సమయం కాదు’

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను చేర్చడాన్ని మరోసారి తిప్పికొట్టింది ప్రభుత్వం. దానికి ఇది తగిన సమయం కాదంటూ...

GST – Nirmala Sitharaman ‘జీఎస్టీ పరిధిలో వాటిని చేర్చడం సరైన సమయం కాదు’

Nirmala Sitaraman

GST – Nirmala Sitharaman: జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను చేర్చడాన్ని మరోసారి తిప్పికొట్టింది ప్రభుత్వం. దానికి ఇది తగిన సమయం కాదంటూ జీఎస్టీ మండలి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. సమావేశంలో దాన్ని అజెండాలో చేర్చి చర్చించామని వివరించారు.

లఖ్‌నవూలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ అనంతరం కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా కాన్ఫిరెన్స్‌లో ఆమె వెల్లడించారు. సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని చెప్పారు. కొవిడ్‌ సంబంధిత ఔషధాలపై తగ్గింపు డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతుందని అన్నారు. సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంది.

క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించామని వివరించారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. గూడ్ప్ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌కు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులకు జీఎస్టీ నుంచి మినహాయించారు.

Happy Birthday PM Modi: పీఎం మోదీకి 71పూలతో బర్త్ డే విషెస్ తెలిపిన బంగ్లా ప్రధాని

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలీవరి సర్వీసులపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలకు సమాధానమిచ్చారు. వినియోగదారులపై ఎలాంటి పన్నూ వేయడం లేదని చెప్తూ.. గతంలో సంబంధిత రెస్టారెంట్‌ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు చెల్లించాలని నిర్మలా వెల్లడించారు.