Bus Conductor Viral Video: రూ.5 కోసం తన్నులాట.. బస్సు కండక్టర్‌ను చితగ్గొట్టిన ప్రయాణికుడు.. వీడియో వైరల్
ఓ ప్రయాణికుడి నుంచి ఆర్టీసీ బస్సు కండక్టర్ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు. తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడితో కండక్టర్ వాగ్వివాదానికి దిగడంతో ఈ గొడవ చెలరేగింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ బస్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Bus Conductor Viral Video: ఓ ప్రయాణికుడి నుంచి ఆర్టీసీ బస్సు కండక్టర్ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు. తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడితో కండక్టర్ వాగ్వివాదానికి దిగడంతో ఈ గొడవ చెలరేగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎన్సీసీ యూనిఫాంలో ఉన్న ఓ కుర్రాడు మధ్యప్రదేశ్ భోపాల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ బస్టాప్ వద్ద బస్సు ఎక్కాడు.
కండక్టర్ ను టికెట్ ఇవ్వాలని అడిగాడు. అతడు దిగాల్సిన స్టాపునకు రూ.10 టికెట్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అయితే, కండక్టర్ రూ.15 టికెట్ ఇచ్చాడని సమాచారం. ఎన్సీసీ యూనిఫాంలో ఉన్న ఆ కుర్రాడు దిగాల్సిన స్టాపు కంటే దూరంగా ఉండే స్టాపునకు కండక్టర్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తన రూ.5 వెనక్కి ఇవ్వాలని ఆ కుర్రాడు అడిగాడు. అయితే, తాను ఇవ్వబోనని కండక్టర్ చెప్పాడు. దీంతో వాగ్వివాదం చెలరేగింది. కండక్టర్ తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కుర్రాడు అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.
కండక్టర్ బస్సులోని సీటుపై పడిపోయాడు. అనంతరం ఆ కుర్రాడు బస్సు దిగాడు. అయితే, ఆ కుర్రాడి వెనకాలే కండక్టర్ పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కండక్టర్లకు అధికారులు టార్గెట్లు విధిస్తుండడంతోనే ప్రయాణికులకు ఇలా అధిక రేటు టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ నుంచి ఫిర్యాదు అందింది. అయితే, ఆ కుర్రాడు దిగాల్సిన స్టాపునకు టికెట్ ఖర్చు రూ.15 అవుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
NCC cadet thrashes bus conductor for demanding fare in #Bhopal , incident captured in #CCTV . According to the police, the municipal corporation employees and city bus staff have lodged a complaint. There was a dispute about paying less money.#MadhyaPradesh #CCTVFootage pic.twitter.com/6X7ZCmFkYe
— Siraj Noorani (@sirajnoorani) September 14, 2022
Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు