వీడియో : మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 06:59 AM IST
వీడియో : మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా తూలి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ సిబ్బంది.. ఆయనను పైకి లేపారు. ప్రధానికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కి మోడీ వెళ్లారు. గంగా నదిలో బోటు విహారం చేశారు. బోటు విహారానికి ముందు ఈ ఘటన జరిగింది. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు గంగా నదిలో కాసేపు బోటు షికారు చేశారు ప్రధాని మోడీ. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రధాని వెంట ఉన్నారు. అటల్ ఘాట్ దగ్గర బోటులో వీరంతా ప్రయాణం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మోడీ అధ్యక్షతన జాతీయ గంగా మండలి సమావేశం జరిగింది. గంగా నది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలకు ప్రధాని మోడీ అధికారులతో చర్చించారు. స్వచ్ఛ గంగ పనులను ఆయన పరిశీలించారు.