Beer Companies: బీర్ కంపెనీలపై రూ.873కోట్ల ఫైన్

రూ.873కోట్ల రూపాయలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ లతో పాటు ఇతర కంపెనీలైన పలు కేంద్రపాలిత ప్రాంతాల వాటిపై సేల్, సప్లై విషయంలో

Beer Companies: బీర్ కంపెనీలపై రూ.873కోట్ల ఫైన్

Beer Penalty

Beer Companies: కాంపిటీషన్ కమిషన్ బీర్ కంపెనీలపై భారీగా జరిమానా విధించింది. రూ.873కోట్ల రూపాయలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ లతో పాటు మరికొన్నింటికి ఇది వర్తిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇన్వెస్టిగేషన్ తర్వాత యునైటెడ్ బ్రూయరీస్ లిమిటెడ్, సబ్‌మైలర్ ఇండియా లిమిటెడ్, కార్ల్స్‌బెర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లైన మూడు కంపెనీలకు ఫైన్ విధించింది. కాంపిటీషన్ లాను అతిక్రమించారని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్ లో వెల్లడించింది.

పెనాల్టీని తగ్గిస్తూ.. బెనిఫిట్ ఇచ్చామని చెప్పింది. సబ్ మైలర్ ఇండియా లిమిటెడ్ కు 100శాతం, యూబీఎల్ కు 40శాతం, సీఐపీఎల్ కు 20శాతం తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పింది.

యూబీఎల్, కార్ల్స్‌బర్గ్ ఇండియాల జరిమానాల మొత్తం రూ.752కోట్లు, రూ.121కోట్లుగా ఉండనుంది. సబ్ మైలర్స్ ఇండియా లిమిటెడ్ కు రూ.6.25లక్షలు జరిమానాగా విధించారు. సీజ్ చేయకుండా జరిమానా మాత్రమే విధించామని అధికారులు చెప్తున్నారు.