Pornographic Films: పోర్న్ వీడియోలు చూడటం, ప్రచురించడం, షేర్ చేయడం.. భారతదేశంలో ఏది నేరం?

కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు.. డివైస్ ఏదైనా యువత ఎక్కువగా చూస్తున్నది మాత్రం అశ్లీల చిత్రాలే. అందులోనూ మహిళలే ఎక్కువగా పోర్నోగ్రఫీని ఎక్కువగా చూస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.

Pornographic Films:  పోర్న్ వీడియోలు చూడటం, ప్రచురించడం, షేర్ చేయడం.. భారతదేశంలో ఏది నేరం?

Porn

Pornographic Films: కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు.. డివైస్ ఏదైనా యువత ఎక్కువగా చూస్తున్నది మాత్రం అశ్లీల చిత్రాలే. అందులోనూ మహిళలే ఎక్కువగా పోర్నోగ్రఫీని ఎక్కువగా చూస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం మంది మహిళలు అశ్లీల చిత్రాలు వీక్షిస్తున్నారని, పురుషుల విషయానికొస్తే.. 69 శాతం మంది పోర్నోగ్రఫీ చూస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.

వీరిలో కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు అత్యధికంగా పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తున్నట్లుగా సర్వే చెబుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ కంప్యూటర్‌లో పోర్న్ వీడియోలు చూసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, అశ్లీల చిత్రాల విషయంలో భారతదేశంలో చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే, అశ్లీల చిత్రాల విషయంలో ఏం చెయ్యకూడదు అనేది చట్టాలు వివరంగా స్పష్టం చేస్తున్నాయి.

అశ్లీల చిత్రాలు చూడటం, ప్రచురించడం, పంచుకోవడం.. వీటిలో భారతదేశంలో ఏది నేరం అనేది ఇప్పుడు అనుమానమే. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల చిత్రాల ఉత్పత్తి, మరియు ప్రచురణకు సంబంధించిన కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చెయ్యగా.. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

అశ్లీలతపై భారతీయ చట్టం ఏమి చెబుతోంది?
భారతదేశంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) చట్టం 2000, ఇండియన్ పీనల్ కోడ్(IPC) మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(POCSO) చట్టం 2012 నిబంధనలు అశ్లీలతపై అనేక కీలక విషయాలు చెబుతుంది.

అశ్లీలాలను ప్రైవేట్‌గా చూడటం చట్టవిరుద్ధం కాదు
భారతదేశంలో, ప్రైవేట్ ప్రదేశాలలో లైంగిక అసభ్యకరమైన , పోర్న్ విషయాలను చూడటం చట్టవిరుద్ధం కాదు. సుప్రీంకోర్టు కూడా జూలై 2015లో మౌఖికంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది.

రాజ్యాంగపరంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ఉన్న నియమాలను కచ్చితంగా పాటించాలి. బహిరంగ ప్రదేశాలలో చూడడం, ఇష్టం లేని వ్యక్తులకు బలవంతంగా చూపించడం కచ్చితంగా నేరమే. పోర్న్ వెబ్‌సైట్‌లు “నైతికత మరియు డీసెన్సీ” నియమాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం యొక్క టెలికమ్యూనికేషన్ల విభాగం 2015 జూలైలో ఒక ఉత్తర్వు జారీ చేసింది.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 857అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించాయి. అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించాలని ఇండోర్‌కు చెందిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. అయితే, కొన్ని రోజుల తరువాత, నిషేధం తాత్కాలికమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేకంగా పిల్లల అశ్లీలతను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అశ్లీలతకు అడ్డుకట్ట వేస్తుంది.

అశ్లీల వీడియోలు చేయడం.. లేదా ప్రసారం చట్టవిరుద్ధం
సాంకేతిక పరిజ్ఞానం రాకముందు, IPC లోని సెక్షన్ 292లో ప్రత్యేకంగా అమ్మకం, పంపిణీ, బహిరంగ ప్రదర్శన లేదా ఏదైనా అసభ్యకరమైన పుస్తకాన్ని ప్రసారం చేయడం, డ్రాయింగ్, పెయింటింగ్ మొదలైన వాటిని నేరాలుగా వ్యవహరించినట్లే, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి తర్వాత.. చదివే, చూసే లేదా వినే వ్యక్తిని కించపరిచేలా మరియు భ్రష్టుపట్టించేలా ఏది ప్రసారం చేసిన శిక్షార్హులుగా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే పోర్న్ వీడియోలు ప్రసారం చెయ్యడం అనేది చట్ట విరుద్ధంగా పరిగణిస్తున్నారు.

IPC లోని సెక్షన్ 293 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా అశ్లీల వస్తువులను అమ్మడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం లేదా సర్క్యులర్ చేయడం చట్టవిరుద్ధం, మరియు సెక్షన్ 294 ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఏదైనా అసభ్యకరమైన చర్య చేయడం లేదా అసభ్యకరమైన పాటలు పాడటం నేరంగా పరిగణించబడుతుంది. అలాగే వయస్సుతో సంబంధం లేకుండా ఇటువంటి పనులు చెయ్యడాన్ని నేరంగా భావిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞనం పెరిగిపోయిన తర్వాత.. అశ్లీలత ఎక్కువగా ఎలక్ట్రానిక్ రూపంలో లభిస్తుంది. IT యాక్ట్ 2000 చట్టం ప్రకారం.. అసభ్యకరమైన విషయం లేదా లైంగిక చర్యలను కలిగి ఉన్న వస్తువులను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడం చట్టవిరుద్ధం అయ్యింది.